సేఫ్‌ హీరో అంటే అతనేనండీ

సేఫ్‌ హీరో అంటే అతనేనండీ

'నిన్ను కోరి'తో మరోసారి నాని సత్తా చాటుకుంటున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం వారం తిరగకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్ల షేర్‌ రాబట్టుకుని ఆల్రెడీ హిట్‌ అనిపించేసుకుంది. వారాంతంతో పాటు వీక్‌ డేస్‌లోను మంచి వసూళ్లు వస్తూ వుండడంతో, రెండవ వారంలో కూడా వసూళ్లు తగ్గవని ట్రేడ్‌ అంచనా వేస్తోంది.

ఫుల్‌ రన్‌లో ముప్పయ్‌ కోట్ల షేర్‌ రావడానికి అవకాశాలున్నాయని అంటోంది. ఇటీవలి కాలంలో నాని తప్ప ఇంత నిలకడగా విజయాలు అందుకున్న హీరో ఇంకొకరు లేరు. నిన్ను కోరితో కలిపి వరుసగా ఏడవసారి అతని సినిమా కొన్నవాళ్లు నష్టపోకుండా ఒడ్డున పడ్డారు. మజ్ను, ఎవడే సుబ్రమణ్యం, కృష్ణగాడి వీర ప్రేమగాథ హిట్‌ స్టేటస్‌ తెచ్చుకోలేదు కానీ వీటి వల్ల నష్టపోయిన వాళ్లు తక్కువ.

పోయినా కానీ పబ్లిసిటీ ఖర్చుల లాంటివి పోయాయే తప్ప భారీ నష్టాలు అస్సలు రాలేదు. తన సినిమాలు ఎంత నిలకడగా ఆడుతున్నా కానీ వాటి మార్కెట్‌ మితి మీరకుండా చూసుకోవడంలో నాని సక్సెస్‌ అవుతున్నాడు. ఫలానా సినిమాకి ఇంత వచ్చింది కదా అని రేటు పెంచేయకపోవడం వల్లే నాని చిత్రాలు సేఫ్‌ అయిపోతున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలు కొన్నా నష్టాలు తప్పవు కానీ నాని సినిమా కొంటే సేఫ్‌గా వుండొచ్చుననే నమ్మకం బయ్యర్లలో పెరిగిపోయింది. ఇందుకే నానితో సినిమాలు తీసే నిర్మాతలు ఎక్కువ అవుతున్నారు.

మూడు నెలలకో చిత్రం చేసేట్టుగా ప్లాన్‌ చేసుకుంటోన్న నాని నేల విడిచి సాము చేయకుండా ఎన్ని విజయాలు వచ్చినా కానీ గ్రౌండెడ్‌గా వుండడమే అతని సక్సెస్‌కి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. కీపిటప్‌ నాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు