తమన్నా అయిపోయింది.. హన్సికపై పడ్డాడు

తమన్నా అయిపోయింది.. హన్సికపై పడ్డాడు

కొందరు దర్శకులు హీరోయిన్ల గ్లామర్ ను ఎలివేట్ చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు. అలాంటి దర్శకుల్లో సంపత్ నంది ఒకడు. తొలి సినిమా ‘ఏమైంది ఈవేళ’లో నిషా అగర్వాల్ ను గ్లామరస్ గా చూపించిన సంపత్.. తర్వాత ‘రచ్చ’.. ‘బెంగాల్ టైగర్’ సినిమాల్లో తమన్నాను ఎంత సెక్సీగా చూపించాడో.. సినిమాకు ఆమె గ్లామర్ ను ఎలా ఆకర్షణగా మార్చాడో తెలిసిందే. ఇప్పుడు అతడి దృష్టి హన్సిక మొత్వాని మీద పడ్డట్లుంది. సంపత్ కొత్త సినిమా ‘గౌతమ్ నంద’లో హన్సికే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఈ సినిమా ప్రమోషన్లలో ఫోకస్ మొత్తం గోపీచంద్ చుట్టూనే తిరిగింది. గోపీ ఈ సినిమా కోసం సరికొత్త అవతారంలోకి మారాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పుడు కొంచెం ఆలస్యంగా హీరోయిన్ హన్సికను రంగంలోకి దించాడు సంపత్. ‘గౌతమ్ నంద’ లేటెస్ట్ స్టిల్స్ లో వైట్ డ్రెస్ లో మత్తెక్కించే అందంతో కనిపిస్తోంది హన్సిక. ఈ భామ గతంలోనే కొన్ని తెలుగు సినిమాల్లో అందాలు ఆరబోసినప్పటికీ.. ఆ తర్వాత లైమ్ లైట్లో లేకుండా పోవడంతో అందరూ తనను మరిచిపోయారు. ఆ మధ్య బరువు పెరిగిన హన్సిక.. ఇటీవల స్లిమ్ అయి మళ్లీ సెక్సీగా తయారైంది.

‘గౌతమ్ నంద’ స్టిల్స్ లో హన్సిక సరికొత్తగా కనిపిస్తోంది. గ్లామరస్ గానూ ఉంది. తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న హన్సికకు ఈ సినిమా కీలకం. అందుకే ఆమె కూడా సంపత్ స్టయిల్లో గ్లామరస్ గా కనిపించడానికి అడ్డేమీ చెప్పినట్లుగా లేదు. హన్సిక అందాల్ని సరిగ్గా ఎలివేట్ చేయగలిగితే ‘గౌతమ్ నంద’కు పెద్ద ప్లస్ అయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English