సూపర్‌స్టార్‌ భయపడిపోయాడు

సూపర్‌స్టార్‌ భయపడిపోయాడు

ఇంతకుముందు తన సినిమాతో పోటీగా మరో చిత్రమేదైనా రిలీజ్‌ అవుతుందంటే దానికే నష్టమన్నట్టు వ్యవహరించేవాడు షారుక్‌ ఖాన్‌. తన చిత్రాన్ని వాయిదా వేయడానికి, లేదా ముందుకి జరపడానికి ఒప్పుకోకుండా అవతలి చిత్రానికి 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పేవాడు.

కానీ 'బాజీరావు మస్తానీ' చిత్రానికి పోటీగా వచ్చిన 'దిల్‌వాలే' ఫ్లాపవడం, 'కాబిల్‌'తో పోటీ పడిన 'రయీస్‌'కి నష్టాలు రావడంతో షారుక్‌ ఖాన్‌ భయపడిపోయాడు. మరోసారి క్లాష్‌ జోలికి పోకుండా తన సినిమాని సేఫ్‌గా విడుదల చేసుకుంటున్నాడు. నిజానికి ఆగస్టు 11న షారుక్‌ కొత్త సినిమా 'జబ్‌ హారీ మెట్‌ సెజల్‌' విడుదల కావాల్సి వుంది. కానీ అదే రోజున అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న 'టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ' రిలీజ్‌ అవుతోంది.

దీంతో షారుక్‌ చిత్రాన్ని వారం ముందుకి జరిపారు. ఆగస్ట్‌ 11 భారీ సినిమాలు విడుదల చేసుకోవడానికి అనువైన డేట్‌ అనేది తెలిసినా కానీ పంతానికి పోకుండా తమ చిత్రాన్ని ముందుగా విడుదల చేస్తున్నారు. అవకాశం వున్నపుడు క్లాష్‌ అవాయిడ్‌ చేయాలంటూ షారుక్‌ ఖాన్‌ చెబుతున్నప్పటికీ అతను అక్షయ్‌కి భయపడ్డాడని అర్థమవుతోంది. మామూలుగా షారుక్‌ సినిమాతో పోటీ దేనికని టాయ్‌లెట్‌నే ముందుకి జరపాలి.

కానీ వాళ్లతో పంతం పెట్టుకుని తన సినిమా ఓపెనింగ్స్‌ నష్టపోవడం దేనికని షారుక్‌ కాంప్రమైజ్‌ అయిపోయాడు. అసలే ఇంతియాజ్‌ అలీ సినిమాలకి రీచ్‌ తక్కువ కావడంతో మాస్‌ సినిమాలా అనిపిస్తోన్న టాయ్‌లెట్‌తో ఢీకి షారుక్‌ ఇష్టపడలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English