మహేష్'1' కు ‘దర్శకుడు’కు లింకేఎంటంటే

మహేష్'1' కు  ‘దర్శకుడు’కు లింకేఎంటంటే


సుకుమార్ సినిమాలు చూస్తే.. అడుగడుగునా అతడి ముద్ర కనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలో.. ప్రతి డైలాగ్‌లో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటాడు సుక్కు. కానీ సుకుమార్ సినిమాల టైటిల్ కార్డ్స్ చూస్తే.. రచనా విభాగంలో కనీసం అరడజను మంది పేర్లు కనిపిస్తాయి. టాలెంటెడ్ రైటర్స్‌ను దగ్గర పెట్టుకుని.. వాళ్ల నుంచి తన టేస్టుకు తగ్గ ఔట్ పుట్ రాబట్టుకుంటాడు సుక్కు.

ఒకట్రెండు డైలాగ్స్‌తో సహకారం అందించిన వాళ్లకు కూడా టైటిల్ కార్డ్స్‌లో చోటు కల్పించడం సుక్కులో ఉన్న గొప్ప గుణం. తన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో సైతం తన టీం సభ్యుల గురించి గొప్పగా మాట్లాడుతూ.. వాళ్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇస్తుంటాడు సుక్కు. తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న జక్క హరి ప్రసాద్ గురించి అలాగే మాట్లాడాడు సుక్కు. ‘1 నేనొక్కడినే’ సినిమాకు కథ హరిప్రసాద్‌దే అని సుక్కు చెప్పడం విశేషం.

‘‘హరిప్రసాద్ నేను లెక్చరర్‌గా ఉన్న రోజుల నుంచి సహచరుడు. ఇద్దరం ఒకే కాలేజీలో పని చేశాం. నేను అతడికి ఒక కథ వినిపిస్తే వెంటనే నన్ను అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోమన్నాడు. నేను ఇక్కడికొచ్చిన రెండు మూడేళ్లకు తనను అక్కడ ఉండొద్దని చెప్పి ఇండస్ట్రీకి రప్పించేశాను. ‘1 నేనొక్కడినే’ సినిమాకు మూల కథ అందించింది హరి ప్రసాదే. దాన్ని నేను డెవలప్ చేసుకున్నాను. హరి నా వెనుకే ఉంటూ చాలా ఎదిగిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే అతనో మహా వృక్షంలా కనిపించాడు. ‘దర్శకుడు’ కథ విని ఆశ్చర్యపోయాను. నువ్వేనా రాసింది అని అడిగాను. ఔనన్నాడు. మామూలుగా నా కథలే నాకు నచ్చవు. అలాంటిది హరి ప్రసాద్ తన కథతో నన్ను మెప్పించాడు. కథ విషయంలో, సినిమా తీసే విషయంలో అతడికున్న క్లారిటీ ఏంటో నాకు తెలుసు. అందుకే ఒక్క రోజు కూడా నేను షూటింగ్ స్పాట్‌కు వెళ్లలేదు. సినిమా పూర్తి చేసి నాకు చూపిస్తే నా నమ్మకం నిజమే అని తేలింది. సినిమా చాలా బాగా తీశాడు. నా ప్రొడక్షన్లో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ లాగే ఇది కూడా పెద్ద హిట్టవుతుంది’’ అని సుకుమార్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు