నలభై కోట్లు తీసుకో, రాజమౌళిలా చేస్కో!

నలభై కోట్లు తీసుకో, రాజమౌళిలా చేస్కో!

ఒక ప్రాంతీయ చిత్రం ఇండియన్‌ సినిమా ప్రైడ్‌గా మారడంతో బాహుబలి ఇప్పుడు ఇండియన్‌ సినిమా విశ్లేషకులకి కేస్‌ స్టడీగా మారింది. అసలు ఈ చిత్రానికి పాన్‌ ఇండియా అప్పీల్‌ ఎలా వచ్చింది? ఎందుకని ఉత్తరాది జనం కూడా ఈ అనువాద చిత్రాన్ని ఇంతగా విరగబడి చూస్తున్నారంటూ ఎవరికి వారు అధ్యయనాలు మొదలు పెట్టారు.

ఇదిలావుంటే, పీరియడ్‌ సినిమాలకి వుండే ప్రత్యేక ఆకర్షణ, అదనపు బలం ఏమిటనేది బాహుబలితో తేలింది. దీంతో ఈ తరహా చిత్రాలని తీస్తోన్న వారు బడ్జెట్‌కి పరిమితులు పెట్టుకోరాదని అనుకుంటున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ తీస్తోన్న 'పద్మావతి' చిత్రానికి ముందుగా నూట అరవై కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.

బాహుబలి రిలీజ్‌ తర్వాత బడ్జెట్‌ రివైజ్‌ చేసి మరో నలభై కోట్లు పెంచారు. రెండు వందల కోట్ల బడ్జెట్‌ తీసుకుని, బాహుబలికి తగ్గని క్వాలిటీ ఇవ్వాలంటూ భన్సాలీని డిమాండ్‌ చేస్తున్నారు. నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో రాజమౌళి రెండు 'బాహుబలి' చిత్రాలు తీసాడు కనుక, పద్మావతి చిత్రానికి రెండు వందల కోట్లతో ఆ క్వాలిటీ పాజిబుల్‌ అని నిర్మాతలు భావిస్తున్నారు.

అసలే కాంట్రవర్సీలతో ఇప్పటికే ఈ చిత్రానికి అదనపు పబ్లిసిటీ వచ్చి వుండడంతో చారిత్రిక నేపథ్యాన్ని బాక్సాఫీస్‌కి అనుకూలంగా మలచుకోవచ్చునని ఆశిస్తున్నారు. ఏదేమైనా 'బాహుబలి'తో మొత్తం ఇండియన్‌ సినిమా లెక్కలే మారిపోయినట్టున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు