త‌మిళుల కోసం టాలీవుడ్‌ను విమ‌ర్శించేశాడు

త‌మిళుల కోసం టాలీవుడ్‌ను విమ‌ర్శించేశాడు

ప్ర‌ముఖ నటుడు అజయ్ ఘోష్ తెలుగు సినిమా రంగంపై నోరు పారేసుకున్నారు. ఓ సినిమా పాట‌ల విడుద‌ల సంద‌ర్భంగా మాట్లాడిన అజ‌య్ తమిళ సినిమా ఇండస్ట్రీని వేనోళ్ల పొగిడారు. అయితే త‌మిళుల‌ను సూప‌ర్ అని చెప్పేందుకు పొరుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చులకన చేశారు. ఆస్కార్ స్థాయి సినిమాల‌కు త‌మిళ సినిమా పెట్టింది పేర‌ని చెప్పారు. తాను తెలుగు సినిమాల్లో నటించాన‌ని అయితే...ఇలాంటి వ్య‌వ‌హార‌శైలి అక్క‌డ లేద‌ని అజ‌య్ ఘోష్‌ చెప్పారు.

త‌మిళులు గొప్ప అని చెప్పేందుకు తన‌కేమీ భేష‌జాలు లేవ‌ని అజ‌య్ అన్నారు. త‌మిళ ప‌రిశ్ర‌మ స్థాయికి తెలుగు ప‌రిశ్ర‌మ ఎద‌గాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించారు. తమిళుల పొలిటికల్, సోషల్ అవేర్ నెస్ గొప్పదని చెప్పారు.

ఇలాంటిది తాను తెలుగు ప‌రిశ్ర‌మ‌లో చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. కేవ‌లం ప్ర‌సంగ‌మే కాకుండా హావభావాలు, అద్భుతమైన నటనతో మైక్ ముందు ఊగిపోతూ తెలుగుమీడియా మీదా సెటైర్లు సంధించారు. అజ‌య్ సినిమాల్లోనే న‌టుడ‌ని అనుకున్నాం కానీ...వేదిక‌ల మీద కూడా బాగానే న‌టిస్తున్నాడ‌ని కొంద‌రు పంచులు పేల్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు