ఎన్టీఆర్‌తో మళ్లీ ఐదో సారి?

ఎన్టీఆర్‌తో మళ్లీ ఐదో సారి?

ఎన్టీఆర్-సమంతలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పలేం.. అలాగే ఫెయిల్యూర్ కాంబినేషన్ అనీ చెప్పలేం. వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్. ఇంకోటి హిట్.. మిగతా రెండూ డిజాస్టర్లు. తొలిసారి ఈ జోడీ కలిసి నటించిన సినిమా ‘బృందావనం’ మంచి ఫలితాన్నే అందుకుంది కానీ.. ఆ తర్వాత వచ్చిన రభస, రామయ్యా వస్తావయ్యా తేలిపోయాయి. ఐతే గత ఏడాది ‘జనతా గ్యారేజ్’తో బ్లాక్ బస్టర్ కొట్టారు ఎన్టీఆర్, సమంత. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో ఐదో సినిమా రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా లేటెస్ట్ అడిషన్ సమంతే అంటున్నారు.

‘పవర్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘జై లవకుశ’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆ మూడు పాత్రలకూ ముగ్గురు హీరోయిన్లు కావాలి. ఒక హీరోయిన్‌గా రాశి ఖన్నా ఫిక్సయింది. రెండో హీరోయిన్‌గా నివేదా థామస్ పేరును పరిశీలిస్తున్నారు. ఇంకా కన్ఫమ్ కాలేదు. ఇంకో ఎన్టీఆర్ పాత్ర కోసం కొంచెం తక్కువ లెంగ్త్ ఉండే హీరోయిన్ క్యారెక్టర్ ఉందట.

అది ఒక రకంగా అతిథి పాత్రలా ఉంటుందట. ఆ పాత్రకు సమంతను అడుగుతున్నట్లు సమాచారం. ‘అఆ’ తర్వాత చాన్నాళ్ల పాటు తెలుగు సినిమాలు ఒప్పుకోని సమంత ఈ మధ్యే రామ్ చరణ్-సుకుమార్ సినిమాకు ఓకే చెప్పింది. దీంతో పాటు ‘రాజుగారి గది-2’లో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటున్నారు. ఇందులో నిజమెంతో ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English