రామ్‌ చరణ్‌ మరీ ట్రాక్‌ తప్పేస్తున్నాడా?

రామ్‌ చరణ్‌ మరీ ట్రాక్‌ తప్పేస్తున్నాడా?

రొటీన్‌ సినిమాలు కట్టి పెట్టి కొత్త రకం చిత్రాలే చేయాలని బలంగా ఫిక్స్‌ అయిన చరణ్‌ ధృవ తర్వాత సుకుమార్‌ చిత్రాన్ని స్టార్ట్‌ చేసాడు. ఇందులో చరణ్‌ చెవిటివాడి పాత్ర పోషిస్తున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చరణ్‌ రేంజ్‌ స్టార్‌ హీరో ఎవరూ ఈ స్థాయి ప్రయోగానికి పూనుకోలేదు. సుకుమార్‌ చిత్రం ఎలాగుంటుందోనని అభిమానులు అప్పుడే కలవర పడుతున్నారు. ఇంతలో మణిరత్నం డైరెక్షన్‌లో నెక్స్‌ట్‌ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు జోరందుకున్నాయి.

మణిరత్నం ఇటీవలి ఫామ్‌ని చూసుకుంటే ఆయననుంచి క్లాసిక్స్‌ రావడం కాస్త కష్టమే. ఆయన సినిమాలు పూర్తిగా క్లాస్‌కే పరిమితమవుతాయి కనుక చరణ్‌ చేయనున్న అతిపెద్ద ప్రయోగమిదేనని చెప్పవచ్చు. ఎన్టీఆర్‌, ప్రభాస్‌ కూడా తమ మాస్‌ ఇమేజ్‌ని బ్రేక్‌ చేయడానికి క్లాస్‌ చిత్రాలు చేసారు కానీ మరీ ఇంతగా అవుటాఫ్‌ ది వే వెళ్లిపోలేదు. తమ జోన్‌లో వుంటూనే కొత్త రకం సినిమాలు ట్రై చేసారు.

చరణ్‌ అలా తన బలాన్ని విడిచిపెట్టకుండా ప్రయోగాలు చేయాలి కానీ ఈ విధంగా పూర్తిగా మాస్‌కి దూరమయ్యే సినిమాలు చేస్తే కొత్త ఫాన్స్‌ రావడం మాటేమో కానీ ఉన్న ఫాన్స్‌తో లింక్‌ కట్‌ అయిపోతుంది. మణిరత్నం సినిమా గ్యారెంటీగా వుంటుందని అరవింద్‌ స్వామి కూడా తేల్చేసాడు. చరణ్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నట్టు ఆయన మీడియాకి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు