నాలుగు రోజుల్లోనే లాభాల్లో ఘాజీ

నాలుగు రోజుల్లోనే లాభాల్లో ఘాజీ

తెలుగు సినిమా పోకడలకి భిన్నంగా, అసలు పాటలు, కామెడీ లాంటివి లేకుండా ప్రయోగాత్మకంగా తీసిన ఘాజీ మొదటి రోజునుంచీ అద్భుతమైన రెస్పాన్స్‌తో రన్‌ అవుతోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఈ చిత్రానికి వచ్చిన మౌత్‌ టాక్‌తో ఆదరణ రోజు రోజుకీ పెరుగుతూ వెళ్లింది. ఈ చిత్రం జోనర్‌ని దృష్టిలో వుంచుకుని తక్కువ రేట్లకే అమ్మడం వల్ల బయ్యర్లకి నాలుగు రోజుల్లోనే పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాలు కూడా చూసారు. చాలా ఏరియాల్లో తెలిసిన పంపిణీదారులతో రిలీజ్‌ చేసుకున్న నిర్మాతలు, కొన్ని ఏరియాలు మాత్రం అడ్వాన్స్‌ పద్ధతిలో అమ్మారు. అన్ని ఏరియాల్లోను ముందుగా వచ్చిన ఆఫర్‌ రేట్ల కంటే ఎక్కువ షేర్లే వచ్చాయి.

ఈ చిత్రం తమిళం, హిందీలో కూడా బాగా ఆడుతుండడంతో పార్టనర్‌షిప్‌లో చేసిన నిర్మాతలు అప్పుడే లాభాలు చూస్తున్నారు. ఈ చిత్ర విజయంతో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలని పకడ్బందీగా చేస్తే తప్పక ఫలితముంటుందని తేలింది. అయితే సాంకేతిక పరంగా ఎక్కడా రాజీ పడకుండా, క్వాలిటీ ప్రాడక్డ్‌ని అందించడం ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. సాంకేతిక నిపుణులు అందరూ పేరెన్నికగల వాళ్లే వుండడంతో ఘాజీ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. అలాగే పబ్లిసిటీ పరంగా కూడా నిర్మాతలు చాలా కేర్‌ తీసుకోవడంతో ఘాజీ విజయం పక్కా అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ పరంగా సూపర్‌హిట్‌ స్థాయిని అందుకోవడం ఖాయమని ట్రేడ్‌ చెబుతోంది. కంగ్రాట్స్‌ టు ఘాజీ టీమ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English