నయనతార టార్చర్‌ పడలేక అది లేపేసారట

నయనతార టార్చర్‌ పడలేక అది లేపేసారట'బాబు బంగారం' సినిమాలో విలన్‌ పాత్ర ఎవరు చేస్తున్నారో ఏమో కానీ ఈ చిత్రానికి విలన్‌ ఎవరిని ఆ యూనిట్‌ని అడిగితే మాత్రం 'నయనతార' పేరు చెబుతున్నారు. ఎప్పుడో విడుదలైపోవాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ వెలుగు చూడకపోవడానికి నయనతారే కారణమట. ఆమె నటించాల్సిన కొన్ని సీన్లు, ఒక పాట చాలా కాలంగా పెండింగ్‌ ఉండిపోయిందట. వాటిని తర్వాత చేస్తానంటూ వాయిదా వేస్తూ వచ్చిన నయనతార చివర్లో ఆ పాటలో నటించలేనంటూ తేల్చి పారేసిందట. ఎందుకంటే ఆ పాట బాగా మాస్‌గా వుందని, హీరోతో రాసుకు పూసుకుని ఉండాలని, అలాంటి సీన్లలో తాను నటించలేనని, తన బాయ్‌ఫ్రెండ్‌ చాలా బాధ పడతాడని సాకు చెప్పిందట.

కానీ కమర్షియల్‌ సినిమాకి అలాంటి మసాలా పాట ఉండి తీరాలంటూ దర్శకుడు మారుతి ఆమెని బతిమాలుకున్నాడట. అతను ఎంతగా అడిగినా కానీ నయనతార మాత్రం అవి పూర్తి చేయనని తేల్చేసి వీళ్ల ఫోన్‌ కాల్స్‌ కూడా ఆన్సర్‌ చేయడం మానేసిందట. ఎప్పటికైనా అమ్మవారు కరుణించి దిగి వస్తారని చూసిన 'బాబు బంగారం' బృందం ఇక ఆశలు వదిలేసుకుంది. ఆమె కోసం కూర్చుంటే సినిమా విడుదల చేయలేమని అర్థం కావడంతో మొత్తంగా ఆ పాటని, సీన్లని సినిమా నుంచి తొలగించేసారట. ఆడియోలో కూడా ఆ మసాలా పాట లేకపోవడంతో ఇక బాబు బంగారంలో చివర్లో ఊపున్న మాస్‌ సాంగ్‌ వస్తుందనే ఆశలు వదిలేసుకోవచ్చు అన్నమాట. అలా నయనతార బీఎఫ్‌ భక్తి ఇలా 'బాబు బంగారం' చావుకొచ్చిందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు