సింహాద్రికి 13 ఏళ్ళు.. అదే కసి...

సింహాద్రికి 13 ఏళ్ళు.. అదే కసి...

అప్పటికి ఏ క్రేజ్‌ లేని ఓ దర్శకుడు.. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓ హీరో.. పెద్దగా తెలియని హీరోయిన్లు.. వీళ్లంతా కలిసి ఓ సినిమా చేసారు. అదే సింహాద్రి. విడుదలకు ముందు వరకు కూడా ఈ సినిమాపై ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. సైలెంట్‌ గా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా విడుదల అయింది సింహాద్రి. జులై 9,2003లో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చేసింది. రాజమౌళిని రాత్రికి రాత్రే స్టార్‌ డైరెక్టర్‌ గా మార్చేసిన సినిమా ఇది. అప్పటికే ఆది హిట్‌ తో క్రేజీ హీరోగా మారిన ఎన్టీఆర్‌.. సింహాద్రితో సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. ఏకంగా ఫ్యూచర్‌ నెంబర్‌ వన్‌ అని పొగిడేసారు.

అప్పటి వరకు ఇంద్ర పేరుపై ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నీ సింహాద్రి తిరగరాసింది. 300 థియేటర్స్‌ లో విడుదలైన సింహాద్రి.. 168 సెంటర్లలో 50 రోజులు ఆడింది.. ఇక 125 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఇంద్ర రికార్డుని కూడా సింహాద్రి దాటేసింది. 146 సెంటర్లలో వంద రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది సింహాద్రి. అంతేకాదు.. 52 కేంద్రాలలో 175 రోజులు ఆడిన సినిమా సింహాద్రి. ఇప్పటికీ ఇది ఆల్‌ టైమ్‌ రికార్డే. వసూళ్ళలోనూ సింహాద్రిది అగ్ర తాంబూలమే. ఈ సినిమా అప్పట్లోనే 28 కోట్లు వసూలు చేసింది. ఇంద్ర పేరుపై ఉన్న 26 కోట్ల రికార్డ్‌ అందుకుంది సింహాద్రి. ఈ సినిమా వచ్చి 13 ఏళ్ళవుతున్నా.... ఇప్పటికీ ఎన్టీయార్‌ డ్యాన్సుల్లో, ఫైట్లలో అదే కసి కనిపిస్తోంది. ఎన్టీయార్‌ ప్రస్తుతం నటిస్తున్న జనతా గ్యారేజ్‌ సైతం అనేక రికార్డులు కొల్లగొడుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు