నందమూరి ట్యాగ్‌ వాడుకోడేంటి?

నందమూరి ట్యాగ్‌ వాడుకోడేంటి?

ఆడియో ఫంక్షన్లకి బాలకృష్ణనే ముఖ్య అతిథిగా పిలుస్తోన్న నారా రోహిత్‌ సినిమాల్లో మాత్రం నందమూరి ట్యాగ్‌ వాడుకోవడం లేదు. తుంటరి సినిమాలో నారా చంద్రబాబునాయుడు కటౌట్‌ పెట్టుకుని, పెదనాన్న గురించి పంచ్‌ డైలాగులు పేల్చాడు. పొలిటికల్‌గా నారా చంద్రబాబునాయుడు పెద్ద పవర్‌ అనే దాంట్లో అనుమానాలు లేవు కానీ, సినిమాల్లో ఆయనని చూపించి కలక్షన్లు రాబట్టుకోవాలంటే ఎలా కుదురుతుంది.

బాలకృష్ణని వాడుకుంటూ వేరే హీరోలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంటే, తనకి ఆయనతో మంచి సంబంధాలు వుండి కూడా నందమూరి అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయకపోతే ఎలా? జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌కి సపోర్ట్‌ చేయని బాలకృష్ణ.. నారా రోహిత్‌, తారకరత్నలిద్దరినీ భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రోహిత్‌ తనకిచ్చిన సువర్ణావకాశాన్ని వాడుకోలేకపోతున్నాడు. ఇప్పటికి ఇన్ని సినిమాలు చేసినా కానీ రోహిత్‌కి నందమూరి అభిమానుల నుంచి సపోర్ట్‌ అయితే లభించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు