ప్రభాస్‌ మీద 70 కోట్లు పెట్టేస్తారా?

ప్రభాస్‌ మీద 70 కోట్లు పెట్టేస్తారా?

ప్రతి  హీరోకూ ఇంత మార్కెట్‌ అని ఉంటుంది. ఐతే ఇప్పుడు ప్రభాస్‌ మార్కెట్‌ ఎంత అన్నదే అంతుబట్టకుండా ఉంది. మామూలుగా అయితే ఒక హీరో లాస్ట్‌ మూవీ ఎంత కలెక్ట్‌ చేసిందన్నదాన్ని బట్టి మార్కెట్‌ నిర్ణయిస్తారు. ఆ లెక్కన చూస్తే ప్రభాస్‌ మార్కెట్‌ రూ.600 కోట్లు అనుకోవాలి. ఐతే 'బాహుబలి' క్రెడిట్‌ ప్రభాస్‌కు కట్టబెట్టడానికి వీల్లేదు. అందులో మెజారిటీ వాటా రాజమౌళిదే. అసలు ఈ తరహా సినిమాల్ని ప్రత్యేకంగా చూడాలి. ఐతే 'బాహుబలి' కారణంగా  ప్రభాస్‌ మార్కెట్‌ చాలా పెరిగిందన్నది మాత్రం వాస్తవం. 'బాహుబలి'కి ముందు 30-40 కోట్ల మధ్య ఉండేది యంగ్‌ రెబల్‌ స్టార్‌ మార్కెట్‌. 'బాహుబలి' తర్వాత అతడి స్థాయి, మార్కెట్‌ ఎంతో పెరిగిన మాట వాస్తవం.

Also Read: వామ్మో బాలకృష్ణ ఇంత షాకిచ్చాడేంటి?

'బాహుబలి' దెబ్బకు ప్రభాస్‌ రెగ్యులర్‌ సినిమాల బడ్జెట్‌ రెట్టింపు అయిపోతుండటం విశేషం. 'మిర్చి' సినిమాకు ప్రభాస్‌ ఫ్రెండ్స్‌ అయిన వంశీ, ప్రమోద్‌ రూ.35 కోట్ల దాకా బడ్జెట్‌ పెట్టారు. ఐతే బాహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ చేయబోయే కొత్త సినిమాకు ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్‌ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'బాహబులి' తర్వాత ప్రభాస్‌ యువి క్రియేషన్స్‌లో 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకుడిగా ఓ సినిమాకు కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొడక్షన్‌ డిజైన్‌ అంతా పూర్తయిందట. స్క్రిప్టు కూడా పక్కాగా రెడీ అయిందట. అక్టోబరులో 'బాహుబలి' పూర్తి చేసుకుని ప్రభాస్‌ బయటపడబోతుండగా.. నవంబర్లో ఈ చిత్రం సెట్స్‌ మీదికి వెళ్తుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు