'మెగా' మైండ్‌ ఎందుకొచ్చినట్లు?

'మెగా' మైండ్‌ ఎందుకొచ్చినట్లు?

సడన్‌గా ఈయన స్క్రీన్‌ మీదకు వచ్చారేంటి? ఎవరిదో సినిమా జరుగుతుంటే మీరెందుకు పైరసీ గురించి మాట్లాడినట్లు? వారి కోపం బెంగుళూరులో పోలీస్‌లతో మాట్లాడి 9 మంది క్రిమినల్స్‌ను ఎందుకు అరెస్టు చేయించినట్లు? కోర్టు నుండి జాండూ ఆర్డర్‌ తెప్పించడమే కాకుండా, పైరసీకి పాల్పడిన ధియేటర్‌ను గుర్తించి దానిని ఒక సంవత్సరం బ్యాన్‌ చేస్తామంటూ వార్నింగ్‌ ఎందుకిచ్చినట్లు?

ఇదంతా టాలీవుడ్‌ అనే లోకకళ్యాణం కోసం నిర్మాత అల్లు అరవింద్‌ సాటి నిర్మాత శోభు యార్లగడ్డ కోసం చేస్తున్నారని పాజిటివ్‌గా తీసుకోవుచ్చు. బాహుబలి యాంటీ పైరసీ ప్రెస్‌ మీట్‌లో ఆయన్ను చూశాక ఇలాగే అనుకున్నారు. అయినాసరే అరవింద్‌ గారు అసలు సీన్‌లోకి ఎందుకొచ్చారు అంటే.. ఏమో ఆయన సినిమాకు సీక్రెట్‌ ఇన్వెస్టర్‌ ఏమో.. ఏమైనా ధియేటర్స్‌లో హెల్ప్‌ చేశారేమో.. మార్కెటింగ్‌లో ఓ చెయ్యాశారేమో.. ఏదైనా 'మెగా' మైండ్‌కే చెల్లుతుందప్పా!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు