ఆమెకి లిఫ్ట్‌ ఇస్తున్న మారుతి

ఆమెకి లిఫ్ట్‌ ఇస్తున్న మారుతి

దర్శకుడు మారుతి తనకో బ్రాండ్‌ నేమ్‌ తెచ్చుకోవడమే కాకుండా తన వల్ల ఇంకొందరు కూడా పరిశ్రమలో బిజీ అయ్యేట్టు చూసుకుంటున్నాడు. తనకి తెలిసిన వారిని దర్శకులుగా పరిచయం చేస్తూ మారుతి ఇండస్ట్రీలో చాలా వేగంగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన ఆర్టిస్టులకి కూడా బ్రేక్‌ ఇచ్చే బాధ్యతని అతనే తీసుకున్నాడని వినిపిస్తోంది. 'ప్రేమకథా చిత్రమ్‌'లో నటించిన నందితకి అవకాశాలు ఇప్పించడానికి స్వయంగా మారుతి రికమండేషన్లు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాను తీయబోయే ఓ సినిమాలో నందితనే హీరోయిన్‌గా ఎంచుకున్న మారుతి ఇతరులకి కూడా ఆమె పేరు సిఫార్సు చేస్తున్నాడట. ఓ స్టార్‌ హీరో సినిమాలో రెండో హీరోయిన్‌ రోల్‌ ఆమెకి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కూడా మారుతి రికమండేషనే కారణమట. మారుతి రికమండ్‌ చేయడం కాదు కానీ నిజంగానే నందిత 'ప్రేమకథా చిత్రమ్‌'లో అద్భుతమైన నటన కనబరిచింది. అయితే ఎంత టాలెంట్‌ ఉన్నా కానీ ఇండస్ట్రీలో గాడ్‌ ఫాదర్స్‌ ఉండడం వల్ల లాభం కాబట్టి తనకి మారుతి రూపంలో అలాంటోడు ఒకడు దొరకడం మంచిదే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు