వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల వ్యవహారం సినీ డ్రామాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వ్యవహారంపై శ్రీనివాస్ భార్య పోలీసులను ఆశ్రయించడం, శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మాధురి, శ్రీనివాస్ లు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మాడ వీధుల్లో రీల్స్ చేశారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాధురిపై పోలీసులు కేసు పెట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రీల్స్ చేశారన్న ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే ఆ కేసుపై మాధురి స్పందించారు. తాను శ్రీనివాస్ తో కలిసి తిరుమలలో రీల్స్ చేయలేదని, అనవసరంగా తనపై కేసులు పెట్టారని మాధురి ఆరోపించారు. దర్శనం చేసుకొని వస్తుంటే కొందరు మీడియా మిత్రులు తమ వెనుకపడి తనను పలు ప్రశ్నలు వేశారని, ఆ రోజు సాయంత్రం ప్రదక్షిణల సందర్భంగా కూడా మీడియా మిత్రులు తమ దగ్గరకు వచ్చారని అన్నారు. అంతేకాగా, తిరుమలలో తాను రీల్స్, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ వంటివి చేయలేదని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టులో జవాబిస్తానని అన్నారు.
తాము ఈ నెల 7న తాము తిరుమలలో పర్యటించామని, 9న పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ఓ ఛానెల్ లో మాట్లాడానని, ఆ తర్వాత 10వ తేదీన తనపై కేసు పెట్టారని తెలిపారు. పవన్ కల్యాణ్ ను విమర్శించిన కారణంగానే తనపై కేసు పెట్టారని మాధురి అంటున్నారు. ఓ ఛానెల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు తమ రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు. రాజకీయాలు వేరని, వ్యక్తిగత జీవితం వేరని అన్నారు. దువ్వాడపై జగన్, వైసీపీ చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయని, కానీ, పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు కదా ఆయనను విమర్శించరా అని ప్రశ్నించారు. పవన్ ఒక డిప్యూటీ సీఎం అని, ఆయన చేసిన దానిని విమర్శించని జనసేన శ్రేణులు తమను మాత్రం విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 12, 2024 12:39 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…