Movie News

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది. అదే మూడో భాగం ఉంటుందా లేదాని. దర్శకుడు ఆదిత్య ధార్ నిన్న ఉదయం చేసిన సోషల్ మీడియా పోస్టులో ఎండ్ టైటిల్స్ అయ్యాక వెళ్లిపోకండి, చిన్న సస్పెన్స్ ఉందని చెప్పాక పార్ట్ 3 మీద ఆశలు చిగురించాయి. అయితే అలాంటిదేమి లేకుండా కథను ముగించారు. నిన్న ప్రీమియర్లతోనే సస్పెన్స్ వీడింది.

పాకిస్థాన్ లో ఉన్న శత్రు శేషం మొత్తాన్ని చంపేసి హంజా తిరిగి రావడంతో స్టోరీ అయిపోతుంది. మళ్ళీ ఏదో బలవంతంగా ట్విస్టు పెట్టి మూడో భాగానికి క్లూ ఇవ్వడం లాంటివి చేయలేదు. మాధవన్ పాత్రకు ఏదైనా కొత్త టాస్క్ వచ్చినా అతను మరో ఏజెంట్ తో వెళ్తాడు తప్పింది ప్రతిసారి హంజా మీద ఆధారపడడు కాబట్టి, ఆ కోణంలో చూస్తే ఆదిత్య ధార్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ వేరే జానర్ లో ఉంటుంది. సో బాహుబలి లాగా దురంధర్ ఇక్కడితో సమాప్తం.

ఇక బుకింగ్స్ విషయానికి వస్తే గంటకు లక్ష తొమ్మిది వేలకు పైగా టికెట్లతో బుక్ మై షోలో పుష్ప 2ని దాటేసిన దురంధర్ ది రివెంజ్ అంత ఈజీగా ఆగేలా లేదు. ముంబై నగరంలో ఇరవై నాలుగు గంటలు షోలు వేస్తూనే ఉన్నారు. మిడ్ నైట్ స్టార్ట్ అయ్యే వాటికి కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. నాలుగు గంటల నిడివిని ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సంతృప్తి చెందడంతో ఆనందంగా బయటికి వెళ్తున్నారు.

స్పై సినిమాల్లో కొత్త ట్రెండ్ కు దారి చూపించిన దురంధర్ ని చూశాక ప్రేక్షకులు ఇకపై గూఢచారి కంటెంట్ నుంచి ఇలాంటి డెప్త్ నే ఆశించడం సహజం. ముఖ్యంగా దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు భాగాలు కలిపి ఏడున్నర గంటల కంటెంట్ తో జనాన్ని కట్టిపడేసే విద్య గురించి ఆదిత్య ధార్ ఫిలిం మేకర్స్ కు క్లాసులు తీసుకోవడం అవసరమేమో. కాకపోతే తెలుగుతో సహా ఇతర బాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా సకాలంలో విడుదలై ఉంటే ఇంకా బాగుండేది.

This post was last modified on March 19, 2026 2:55 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

6 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

6 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

8 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

10 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

11 hours ago