విజయదశమి సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం నాడు సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరుపతి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి అని, దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే పోలవరం, అమరావతి, ఇతర నదలు అనుసంధానం ఉంటుందని అన్నారు. ఆ పనులు త్వరగా పూర్తి కావాలని అమ్మవారిని కోరుకున్నానని చంద్రబాబు అన్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్గమ్మ దయ వల్ల వర్షాలు పడ్డాయని అన్నారు. మూలా నక్షత్రం నాడు అందరికీ ఉచిత దర్శనం, ఉచిత లడ్డూ ఇచ్చామని, అన్ని ఏర్పాట్లూ చేశామని అన్నారు. రాబయే రోజుల్లో ఆలయానికి ఆదాయం కంటే, వీఐఔపీల కలంటే భక్తుల మనోభావాల ప్రకారం ఆలయానికి సంబంధించిన నిర్ణయాలుంటాయని చెప్పారు. ప్రతి దేవాలయానికి, ప్రార్ధనా మందిరానికి పూర్వ వైభవం తెస్తామన్నారు.
ఈవీఎంల వ్యవహారంపై జగన్ ను చంద్రబాబు ఏకిపారేశారు. 2019లో ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చిందా…చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి అని జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఏదో ఒకటి మాట్లాతూ ఉండు అని జగన్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కూడా వైసీపీ నేతల మనస్తత్వం తెలియాలి…ఇళ్లు, ఆఫీసుల మీద దాడులు చేసినవారికి కేసులు పెట్టకూడదంటున్న వైసీపీ నేతలను ఏమనాలి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టం వీళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates