జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు.. ఓటర్లను అభ్యర్థించేందుకు లౌకిక వాద పార్టీగా ఉన్నజనసేన ఒక్కసారిగా ఇప్పుడు రైటిస్ట్ పార్టీగా మారిపోయిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత పవన్‌లో మార్పు వచ్చిందని ఆమె అన్నారు. ఆయన వేషం(కాషాయం కట్టుకోవడం), భాష(సనాతన ధర్మ పరిరక్షణ) కూడా మారిపోయాయని తెలిపారు. బాధ్యతా యుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కల్యాణ్ ఒక మతానికి గొడుగు పట్టడం ఏంటని నిలదీశారు.
తిరుపతిలో గురువారం సాయంత్రం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను షర్మిల తప్పుబట్టారు. తన ప్రసంగంలో రాహుల్ గాంధీ ప్రస్తావనను తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. వెంటనే రాహుల్‌కు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మత రాజకీయాల్లోకి రాహుల్‌ను లాగుతున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఖండిస్తున్నానని షర్మిల చెప్పారు. రాహుల్ గాంధీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ ను ఆమె డిమాండ్ చేశారు.
ఇతర మతాల మాటేంటి?
ఒక మతానికి కొమ్ముకాస్తున్నట్టుగా పవన్ వ్యాఖ్యానించారన్న షర్మిల.. రాష్ట్రంలో ఇతర మతాల మాటేంటని ప్రశ్నించారు. ఒక మతానికే డిప్యూటీ సీఎం ప్రతినిధిగా ఉంటే.. ఇతర మతాల వారు అభద్రతా భావంలో ఉండరా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అన్ని మతాల వారూ జనసేనకు ఓటేశారన్న విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ చెప్పినట్టు చేస్తున్న మీకు(పవన్) .. రాహుల్‌ను విమర్శించే నైతికత ఉందా? అని నిలదీశారు.
బీజేపీకి కొమ్ము కాస్తున్న పవన్ కల్యాణ్.. లౌకిక వాదం గురించి మాట్లాడితే నవ్వు వస్తోందన్నారు. గోద్రా(గుజరాత్), మణిపూర్ అల్లర్లకు కారణం బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. అలాంటి పార్టీతో చేతులు కలిపి ఇప్పుడు ఒక మతానికి ప్రతినిధిగా పరిచయం చేసుకుంటున్న పవన్‌కు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదన్నారు. దేశవ్యాప్తంగా సోదర భావం పెంపొందించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని.. అలాంటి నేతపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 4, 2024 10:23 pm
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…