విజయవాడను వరదలు ముంచెత్తి నెల రోజులు కావస్తోంది. వరదల సమయంలో భారీగా ఆస్తినష్టం చోటు చేసకుంది. ప్రాణనష్టమూ జరిగింది. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందో అందరూ చూశారు. 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు పగలూ రాత్రి తేడా లేకుండా గ్రౌండ్లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. విజయవాడ కోలుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేశారు. ఎ
న్నడూ లేని స్థాయిలో నష్టపరిహార ప్యాకేజీని కూడా ప్రకటించి ప్రశంసలందుకున్నారు చంద్రబాబు. ఇక వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా ఆయన ఇచ్చిన పిలుపుతో విరాళాలు వెల్లువెత్తాయి. కార్పొరేట్ కంపెనీల నుంచి వ్యక్తుల వరకు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు.
బహుశా ఏపీ చరిత్రలోనే ఈ స్తాయిలో ఎన్నడూ విరాళాల వెల్లువను చూసి ఉండం అంటే అతిశయోక్తి కాదు. ఈ మొత్తం రూ.400 కోట్లకు చేరినట్లుగా తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఇది చిన్న నంబర్ కాదు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీకి ఇది నిదర్శనంగా భావించవచ్చు. వరద బాధితుల కష్టాన్ని చూసి అందరూ చలించి పోవడం, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి మెప్పించడం, సాయం అందిస్తే దాన్ని సద్వినియోగం చేస్తారన్న నమ్మకం ఉండడం ఈ విరాళాల వెల్లువకు కారణం.
రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, కేంద్ర ప్రభుత్వం అందించే సాయానికి ఈ విరాళాలు కూడా తోడైతే విజయవాడ పూర్వపు రూపు సంతరించుకోగలదని ఆశించవచ్చు. ఐతే ఈ సందర్భంలో జగన్ అధికారంలో ఉండగా ఏం జరిగిందని కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో బాధితులకు అందిన సాయం అంతంతమాత్రం. ఇలా విరాళాలు సేకరించడం, దాతలు స్పందించడం లాంటి దాఖలాలేమీ కనిపించలేదు. విరాళాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేస్తారన్న నమ్మకం ఉండేది కాదు. జగన్ విరాళాల మీద శ్రద్ధ చూపేవారు కాదు. దాతల నుంచీ స్పందన ఉండేది కాదు. ఇక్కడే చంద్రబాబు బ్రాండ్ పవర్ ఏంటన్నది రుజువవుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలోనూ బాబు, జగన్ మధ్య ఉన్న తేడా ఇదే.