ఏపీలో వివాదాస్పదంగా మారిన ‘కోనోకార్పస్’ మొక్కల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మొక్కలను పెంచొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. విదేశాల్లోనూ ఈ మొక్కలను పెంచడం లేదని.. వీటి వల్ల మేలు జరగకపోగా.. కీడు జరుగుతుందని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ‘మనం-వనం’ కార్యక్రమానికి సంబంధించి పవన్ కల్యాణ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం అందరి బాధ్యత అని.. దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈక్రమంలోనే కోనా కార్పస్ మొక్కలను ఎక్కడున్నా పీకేయాలని.. వాటిని పెంచవద్దని సూచించారు. ఒకప్పుడు పచ్చదనం కోసం అరబ్ దేశాలు ఈ మొక్కలు పెంచాయని.. కానీ, వీటి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు రావడంతోపాటు.. భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని గుర్తించారని తెలిపారు. అందుకే మన రాష్ట్రంలో కోనోకార్పస్ మొక్కలను పెంచొద్దని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
మరి వివాదం ఏంటి?
అయితే.. కోనాకార్పస్ మొక్కలపై ప్రస్తుతం ఏపీ హైకోర్టులో నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖల య్యాయి. వీటిపై గత రెండు నెలలుగా విచారణ జరుగుతోంది. ఈ మొక్కలను కొట్టి వేస్తున్నారని.. కాపాడాలని పేర్కొంటూ.. పలువురు పర్యావరణ ప్రేమికులతో పాటు.. వ్యన్య ప్రేమికులు కూడా పిల్స్ దాఖలు చేశారు. అంతేకాదు.. వీటిపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని కూడా వారు తప్పు అని చెబుతున్నారు. ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదని చెబుతున్నారు.
అంతేకాదు… పలువురు బోటానికల్(వృక్ష శాస్త్రం) శాస్త్ర వేత్తలు రాసిన అంశాలను కూడా.. హైకోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. రెండు రోజుల కిందట.. జాతీయ బొటానికల్ అథారిటీ వివరణ కోరింది. ఆ వివరణ వచ్చాక.. చెట్లను పెంచాలో.. వద్దో తేలుస్తామని ప్రకటించింది. ఈ విచారణ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఇంతలోనే పవన్ ఇలా ప్రకటించడంతో పిల్స్ వేసిన వారు..ఏంచేస్తారో చూడాలి.
This post was last modified on August 30, 2024 2:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…