Political News

పిఠాపురం మ‌హిళ‌లకు.. ప‌వ‌న్ కానుక‌లు!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్క‌డి వారి హృద‌యాల‌ను కూడా దోచుకున్నారు. అనేక విమ‌ర్శ‌లు.. ఎత్తులు పైఎత్తుల‌ను కూడా త‌ట్టుకుని ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌వ‌న్‌కు జై కొట్టారు. భారీ మెజారిటీతో విజ‌యం అందించారు. దీనికి కృత‌జ్ఞ‌త‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పిఠాపురంలో అత్యాధుని సౌక‌ర్యాల‌తో కూడిన ఆసుప‌త్రిని ఏర్పాటు చేయిస్తున్నారు. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంత‌లోనే పిఠాపురం మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రావ‌ణ శుక్ర‌వారాన్నిపుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేక కానుక‌లు పంపించారు.

పిఠాపురంలో ప్ర‌త్యేకంగా ఉన్న పుర‌హూతికా అమ్మవారి ఆల‌యం గురించి.. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలిసింది. వాస్త‌వానికి ఎన్నో ద‌శాబ్దాలుగా ఇక్క‌డ అమ్మ‌వారు పూజ‌లు అందుకుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌త్యేకంగా ఈ ఆల‌యాన్ని ద‌ర్శించి అమ్మ‌వారికి పూజ‌లు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా వ‌చ్చి ఆ స‌మ‌యంలోనే పూజలు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ ఆల‌యంలో ప్ర‌తి శ్రావ‌ణ మాసం చివ‌రి శుక్ర‌వారం అమ్మ‌వారికి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేస్తారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు పుర‌హూతికా వృతాలు చేస్తార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పూజ‌ల్లో పాల్గొనే మ‌హిళ‌ల కోసం కానుక‌లు పంపించారు.

ఈ ప్ర‌త్యేక పూజ‌ల‌కు 5 వేల మంది మ‌హిళ‌లు వ‌స్తార‌న్న అంచ‌నా ఉంది. అయితే.. ప‌వ‌న్ మాత్రం అద‌నంగానే 12 వేల ప‌ట్టు చీర‌ల‌ను(ఒక్కొక్క‌టీ రూ.2000ల‌కు త‌గ్గ‌ద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు)పిఠాపురానికి పంపించారు. దీనికి అద‌నంగా.. ప‌సుపు, కుంకను కూడా జ‌త చేశారు. అదేవిధంగా స్థానికంగా మ‌హిళ‌లు వ‌చ్చేందుకు ప్ర‌త్యేక ఏర్పాటు చేయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆల‌య క‌మిటీకి ఈ చీర‌ల‌ను అందించాల‌ని.. తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌కుండా.. ప‌క్కాగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించేలా చూడాలని కూడా ప‌వ‌న్ ఆదేశించారు. దీంతో 12 మంది మ‌హిళ‌ల‌కు ప‌ట్టు చీర‌లు పంపిణీ చేసేందుకు జ‌న‌సేన నాయ‌కులు పిఠాపురానికి క్యూ క‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు పాల్గొనే అవ‌కాశం ఉంది. 

This post was last modified on August 29, 2024 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…

47 minutes ago

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

2 hours ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

4 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

4 hours ago

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని…

4 hours ago