ప్రభాస్‌ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా. కానీ మోషన్ పోస్టర్ వదిలినపుడు దీని లెక్కే వేరు అనిపించింది. ప్రభాస్‌ను ఓల్డ్ కింగ్ గెటప్‌లో చూపించి.. భారీ విజువల్స్‌తో క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు మారుతి. ఇక విడుదలకు మూడు నెలల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్లో ప్రభాస్‌ను రాజు గెటప్‌లో చూపిస్తూ తీసిన సన్నివేశాలు, డైలాగులతో సినిమా మీద అంచనాలను పెంచాడు మారుతి.
ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నట్లుగా కనిపించడం.. మనుషులను గాల్లోకి లేపి కంట్రోల్ చేస్తున్నట్లుగా పెట్టిన షాట్.. ‘‘ఏందిరా మీ బాధ’’ అనే డైలాగ్.. ఇవన్నీ కూడా క్రేజీగా అనిపించాయి. సినిమాకు ఈ పాత్రే హైలైట్ అవుతుందనే అంచనాలు కలిగాయి. ‘రాజాసాబ్’ పోస్టర్లలో కూడా మొదట్నుంచి ఈ రాజు పాత్రనే హైలైట్ చేస్తూ వచ్చారు. సిగార్‌తో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ క్రేజీగా అనిపించింది.
ఈ పాత్ర మీద ఎన్నో అంచనాలతో సినిమాకు వెళ్లిన వాళ్లకు థియేటర్లలో షాక్ తప్పలేదు. ఇంటర్వెల్ ముందు వస్తుంది.. సెకండాఫ్‌లో ఉంటుంది.. క్లైమాక్స్‌లో వస్తుంది అనుకుంటూ ఎంతో ఉత్కంఠతో చూసిన ప్రేక్షకులకు చివరికి నిరాశ తప్పలేదు. సినిమాలో ఎక్కడా ఆ పాత్ర లేదు. ఈ విషయంలో ప్రేక్షకులు తీవ్ర అసహనానికే గురవుతున్నారు. ఈ పాత్ర తాలూకు సన్నివేశాలు లేపేశారంటూ విడుదలకు ముందు ప్రచారం జరిగినా.. అలా ఎలా చేస్తారులే అనుకున్నారు.
మరి ఈ క్యారెక్టర్‌ను పార్ట్-2 కోసం దాచి పెట్టారో ఏమో తెలియదు కానీ.. పార్ట్-1లో ఆ క్యారెక్టర్ లేకపోవడం మాత్రం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తోంది. మరోవైపు రిలీజ్ ట్రైలర్లో చూపించిన ‘జోకర్’ గెటప్ కూడా పార్ట్-1లో లేదని, అది సెకండ్ పార్ట్‌కు లీడ్ అని తేలింది. ఈ విషయాన్ని మారుతి ముందే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టేశాడు. ఆ సంగతి తెలియక థియేటర్లకు వెళ్లిన వాళ్లకూ నిరాశ తప్పలేదు. ఇప్పుడు సినిమాకు డివైడ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ క్యారెక్టర్లను స్క్రీన్ మీద చూస్తామా అన్నది సందేహమే.
This post was last modified on January 9, 2026 1:55 pm
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…