ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసి విడుదలకు మార్గం సుగమం చేయాల్సిందిగా మదరాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాతలు హమ్మయ్య అనుకుంటున్నారు.
అయితే ప్రభుత్వం తరఫున వకీల్ సుందరేశన్ చీఫ్ జస్టిస్ ముందు అప్పీల్ కోరడంతో ఫ్యాన్స్ మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పరిశీలన జరుగుతోంది కానీ ఇంకోసారి వాయిదా పడటం లాంటివి జరగకపోవచ్చు. ఇప్పుడు కెవిఎన్ ప్రొడక్షన్స్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ముందుగా చేయాల్సిన పని బెస్ట్ రిలీజ్ డేట్ సెట్ చేసుకోవడం. పండగ ఛాన్స్ మిస్ అయినట్టే. ఎందుకంటే తమిళనాడులో ఇబ్బంది లేదు కానీ ఓవర్సీస్ లో స్క్రీన్లు వేరే సినిమాలకు కేటాయించారు. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు మొదలైనవి వాటిలో ఉన్నాయి.
జన నాయకుడు తప్పుకోవడంతో ద్రౌపతి 2 లాంటి ఇతర చిత్రాలు హఠాత్తుగా రేసులోకి వచ్చాయి. కార్తీ వా వతియర్ (అన్నగారు వచ్చారు) కూడా ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో జన నాయకుడు జనవరి చివరి వారం రిపబ్లిక్ డే ఆప్షన్ చూడొచ్చు. లేదా ఫిబ్రవరికి షిఫ్టయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఒకవేళ కొత్త డేట్ ఏది తీసుకున్నా ముందు ఏర్పడ్డ బజ్ అయితే రాకపోవచ్చని ఒక అంచనా. విజయ్ ఫ్యాన్స్ మిస్ చేయకపోయినా సాధారణ ప్రేక్షకుల మీద ఈ పోస్ట్ పోన్ల పర్వం ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. కాకపోతే ఒక సానుకూల విషయం ఏంటంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు మంచి స్కోప్ దొరుకుతుంది.
మాములుగా అయితే ఇప్పుడీ పోటీలో నలిగిపోయేది. విజయ్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ వచ్చాక కూడా వివాదానికి దారి తీసిన రాజకీయ అంశాలు ఏమై ఉంటాయనే దాని మీద మూవీ లవర్స్ జన నాయకుడు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on January 9, 2026 11:39 am
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…