Political News

ప్ర‌జ‌ల కోసం కూలీన‌వుతా:  ప‌వ‌న్

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లాలోని మైసూరువారిపాలెం గ్రామంలో నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. గ్రామ‌స్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ప‌వ‌న్ స్పందించారు. తాను ప‌నిచేసేందుకు, ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు.

“ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌న్న నిబ‌ద్ధ‌త ఉంది. అస‌వ‌ర‌మైతే.. వారి కోసం కూలీగా మారేందుకు నేను సిద్ధం. నేను నిరంత‌రం.. ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తున్నా. వారికి క‌ష్ట‌మొస్తే.. అండ‌గా ఉన్నా. ఈ రోజు డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఉన్నా.. కానీ, నాకు ప్ర‌జ‌లే ముఖ్యం. ప‌ద‌వులు ముఖ్యం కాదు“ అని ప‌వ‌న్ తేల్చి చెప్పారు.  చంద్ర‌బాబు వంటి దూర‌దృష్టి(విజ‌న్‌) ఉన్న నాయ‌కుడి ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తాను ఎంతో నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు.

చంద్ర‌బాబు వ‌ల్లే.. ల‌క్ష‌ల మందికి ఒకే ఒక్క‌రోజులో పింఛ‌న్లు ఇవ్వ‌గ‌లుగుతున్నామ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానిం చారు. అప్పుల నుంచి అభివృద్ధి దిశ‌గా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించ‌గ‌ల శ‌క్తి ఒకే ఒక్క చంద్ర‌బాబుకు మాత్ర‌మే ఉంద‌ని వ్యాఖ్యానించారు. “నాకంటే బాగా ఆలోచించ గలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది“ అని ప‌వ‌న్ తేల్చి చెప్పారు.  

త్వ‌ర‌లో గూండా నిరోధ‌క‌ చ‌ట్టం

త్వ‌ర‌లోనే గూండా నిరోధ‌క‌ చ‌ట్టం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో కొంద‌రు చేస్తున్న ఆగ‌డాలు.. భూక‌బ్జాల‌ను ఎదుర్కొనేందుకు ఈ చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్టు తెలిపారు. రాయ‌ల‌సీమ‌లో వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వాటిని అరిక‌ట్టేందుకు త్వ‌ర‌లోనే `నైపుణ్యాభివృద్ది విశ్వ‌విద్యాల‌యాన్ని` తీసుకురానున్న‌ట్టు తెలిపారు. దీనిద్వారా.. గ్రామీణుల‌కు శిక్ష‌ణ ఇచ్చి.. ఇక్క‌డే ఉపాధి మార్గాలు వెతుక్కునేలా చేస్తామ‌ని చెప్పారు.  

This post was last modified on August 23, 2024 9:25 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago