ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. కీలక నాయకుడు, కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు పేర్కొన్నారు. బలమైన సామాజిక వర్గంతోపాటు.. వినయశీలి, విధేయుడిగా కూడా నానీకి మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న నాని.. తొలి రెండున్నరేళ్లపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఈ పదవిని విడదల రజనీకి ఇచ్చారు.
వాస్తవానికి నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కరోనా దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో ఆయన అలుపెరుగని సేవ చేశారు. ఎక్కడా చిన్న విమర్శ కూడా రాకుండా.. కరోనా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. దీనికిగాను.. ఆయన కేంద్రం నుంచి అప్పట్లో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇది తగ్గుముఖం పట్టిందనే లోగా.. సొంత నియోజకవర్గం ఏలూరులో జనాలు విష పూరిత వాయువు పీల్చి పదుల సంఖ్యలో మృతి చెందారు.
దీంతో రేయింబవళ్లు నాని అక్కడే ఉండి సేవలు చేశారు. వైద్యం అందేలా.. ఉరుకులు పరుగులు పెట్టా రు. అధికారులతో పెట్టించారు కూడా. అయితే.. అలాంటి నానీని ఠంచనుగా మంత్రి పదవి నుంచి జగన్ తప్పించేశారు. నిజానికి ఆయనను కొనసాగించాలని సొంత పార్టీ నాయకులే చెప్పినా జగన్ వినిపించుకోలేదనే వాదన ఉంది. ఈ క్రమంలోనే విడదల రజనీకి పెద్ద పీట వేశారు. అయితే.. నాని ఎక్కడా ఎదురు మాట్లాడలేదు. అధినేత చెప్పిందే వేదంగా భావించి ముందుకు సాగారు.
కాగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో చివరి నిముషం వరకు కూడా ఆయనకు టికెట్ ఇస్తారా లేదా? అనే టెన్షన్ కొనసాగింది. చివరకు టికెట్ ఇచ్చినా.. కూటమి హవాలో ఆయన కూడా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి బయటకు రాని నాని.. తాజాగా వైసీపీకే కాదు.. ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరం అవుతున్నట్టు పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగిన నాని.. వివాద రహితుడు.. అందరికీ కావాల్సిన వాడు కావడం గమనార్హం.
This post was last modified on August 9, 2024 3:11 pm
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…