Political News

రేవంత్ ఫారిన్ ట్రిప్: 3 భేటీలు.. 6 ఒప్పందాలు

అసెంబ్లీ సమావేశాల్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు విదేశాల బాట పట్టారు. ఈ రోజు (శనివారం) ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా.. దక్షిణ కొరియా దేశాల టూర్ కు వెళుతున్నారు. మొత్తం పన్నెండు రోజులు సాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట.. సీఎస్ శాంతకుమారి.. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్.. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు.. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అమెరికా పర్యటనకు వెళతారు. వారంతా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ అండ్ టీంతో కలుస్తారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ.. ప్రవాస భారతీయులతోనూ భేటీ కానున్న సీఎం రేవంత్ పదిన అమెరికా నుంచి బయలుదేరి దక్షిణ కొరియా సియోల్ కు చేరుకుంటారు.
అక్కడ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. పద్నాలుగున రాష్ట్రానికి తిరిగి వస్తారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలో (జనవరి 15) దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన.. పెట్టుబడుల కోసం తాజాగా విదేశాలకు పర్యటించటం ఇదే తొలిసారి. ఈ టూర్ లో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకునేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మూడు భేటీలు.. ఆరు ఒప్పందాలన్న లక్ష్యంతో రేవంత్ విదేశీ పర్యటన ఉంటుదన్న మాట వినిపిస్తోంది. తన పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాల్లో (న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, కాలిఫోర్నియా) ఆయన పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యే వివిధ కంపెనీల ముఖ్యల జాబితాను చూస్తే.. ఆయన టూర్ ఎంత పక్కాగా ప్లాన్ చేసింది అర్థమవుతుంది.

ఆగస్టు 5: కాగ్నిజెంట్ సీఈవో.. సిగ్నా సీనియర్ అధికారి.. ఆర్ సీఎం.. టీబీసీ.. కార్నింగ్.. జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ. ఆర్గా సీఈవో రామక్రిష్ణ.. పీ అండ్ వో సంస్థ సీవోవో శైలేష్ జెజురికర్.. ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ
ఆగస్టు 6: పెప్సికో.. హెచ్ సీఏ ఉన్నతాధికారులతో భేటీ. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం.
ఆగస్టు 7: ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, పలు ఐటీ సంస్థలతో భేటీలు
ఆగస్టు 8: ట్రినెట్ సీఈవో.. ఆరమ్.. ఆమ్ జెన్.. రెనెసాస్.. అమాట్.. సెలెక్ట్ టెక్ యూనికార్న్ ప్రతినిధులతో పాటు సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు
ఆగస్టు 9: గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ.. స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన.. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్.. జెడ్ స్కేలర్ సీఈవో.. ఎనోవిక్స్.. మోనార్క్ ట్రాక్టర్స్.. థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులతో భేటీ
ఆగస్టు 12: దక్షిణ కొరియాలోని యూయూ ఫార్మా.. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ట టైల్స్ ఇండస్ట్రీ.. ఎల్ ఎస్ హోల్డింగ్స్.. హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిదులతో పాటు ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ.
ఆగస్టు 13: కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు సామ్ సంగ్.. ఎల్ జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

30 minutes ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

6 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

7 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

9 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

9 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

10 hours ago