Movie News

వరుణ్ సందేశ్ ‘విరాజి’ ఎలా ఉంది

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సూపర్ హిట్లతో ఒకప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో కొంత కాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. యుఎస్ లో ఉండి వచ్చి రెండేళ్లుగా తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా పర్ఫెక్ట్ కంబ్యాక్ జరగలేదు. ప్రయోగాలైతే చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో విరాజి మీద బోలెడు ఆశలు పెట్టుకుని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. సెమీ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ క్రైమ్ డ్రామా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలా ఉందో చూద్దాం.

ఎక్కడో దూరంగా ఓ కొండ మీద మూసేయబడిన పిచ్చాసుపత్రి ఉంటుంది. ఈవెంట్ పేరుతో కొందరిని ట్రాప్ చేసి అక్కడికి పిలిపిస్తారు. స్టాండప్ కమెడియన్, సినీ ప్రొడ్యూసర్, ఫోటోగ్రాఫర్, ఆస్ట్రాలజిస్ట్, నూతన దంపతులు ఇలా అందరూ ఒకే గూటికి చేరేలా స్కెచ్ వేస్తారు. తీరా అక్కడికి వచ్చాకే తాము ప్రమాదకరమైన వలయం చిక్కుకున్నామని గుర్తించి హతాశులవుతారు. వీళ్ళతో పాటు ఒక ఎస్ఐ, డాక్టర్ కూడా ఉంటారు. తప్పించుకోవడానికి ట్రై చేసిన ఇద్దరు హత్యకు గురయ్యాక అక్కడికి ఆండీ (వరుణ్ సందేశ్) వస్తాడు. డ్రగ్స్ కోసం తపించి పోయే ఇతనికి ఆ బ్యాచుకి మధ్య జరిగేదే అసలు కథ.

దర్శకుడు ఆద్యంత్ హర్ష ఒక అరగంటలో చెప్పాల్సిన పాయింట్ ని గంటా నలభై నిమిషాలకు విస్తరించుకోవడంతో విరాజి ముప్పాతిక భాగం విపరీతమైన సాగతీతతో నడుస్తుంది. పాత్రల పరిచయం, వాళ్ళ మధ్య సంభాషణలు ఏ మాత్రం ఆసక్తి కలిగించకపోగా విసుగు తెప్పించేలా జరుగుతాయి. చివరి అరగంటలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ హార్ట్ బీట్ ఆగిపోయిన పేషెంట్ కి పల్స్ రేట్ చెక్ చేసినట్టయ్యింది. బడ్జెట్ పరిమితులు ఎన్ని ఉన్నా కథా కథనాల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం దెబ్బ తీసింది. ఫైనల్ గా విరాజి ఏ క్యాజీ అనిపించడం తప్ప ఏం చేయలేకపోయాడు.

This post was last modified on August 3, 2024 10:41 am

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

19 minutes ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

49 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

2 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

3 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

3 hours ago