ఓ మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని, ఆమెతో సాయిరెడ్డి బిడ్డను కూడా కన్నారని ఆమె భర్త మదన్ గోపాల్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలు ఖండిస్తూ సాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని న్యూస్ ఛానెళ్లపై, కొందరు న్యూస్ ప్రజెంటర్లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ మీ పుట్టుక మీదే నాకు అనుమానం ఉందిరా…అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ విజయసాయి వాడిన అసభ్యకరమైన భాషపై విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై సాయిరెడ్డి వాడిన పదజాలంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై ప్రెస్ మీట్ లో విజయసాయి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని లోకేష్ దుయ్యబట్టారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో విజయసాయి దూషించడాన్ని ఖండించారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న విజయసాయికి మంచీ మర్యాద గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
విజయసాయికి అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో వైసీపీ నేతల భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అయితే, ఇంత విమర్శించినా..విజయసాయిరెడ్డి గారూ అంటూ లోకేష్ సంబోధిస్తూ తన హుందాతనాన్ని చాటుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates