ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఉన్న కసినంతా ఆయన బయట పెట్టేసుకున్నారు.
ప్రస్తుతం ఓటమి భారంలో ఉన్న జగన్.. నాయకులను ఊరడిస్తున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకులతో ఇంటరాక్ట్ అవుతూ.. వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. మనకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందని అది ఎటూ పోలేదని కూడా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాను త్వరలోనే ప్రజల మధ్యకు వస్తానని కూడా..జగన్ చెబుతున్నారు. దీనికి సంబంధిం చి అంతర్గతంగా వర్కవుట్ కూడా చేస్తున్నారు. ఏ రూపంలో ప్రజల మధ్యకు రావాలనే అంశంపై చర్చలు చేస్తున్నారు.
త్వరలోనే దీనిపై పార్టీ కూడా .. ప్రకటన చేయనుంది. ఇంతలోనే ఈ వ్యాఖ్యలపై బుచ్చయ్య స్పందించారు. జగన్ ప్రజల్లోకి వస్తున్నట్టు ప్రకటించారని చెప్పిన ఆయన.. ఈ సారి జగన్ ప్రజల్లోకి వస్తే.. గతంలో రాళ్లతో కొట్టారు. ఇప్పుడు చెప్పులతో కూడా కొడతారు. ముఖాన పేడ కొడతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య.. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ అవలంభించిన విధ్వంసకర విధానాలే ఆ పార్టీని ముంచాయని.. ఇక ఆ పార్టీ తేరుకోదని చెప్పారు. నేను ఆ పార్టీ వాడిని కాకపోయినా.. ముందు నుంచి చెప్పాను. ఈ విధ్వంసకర , కక్ష పూరిత రాజకీయాలు మానుకో. అని చెప్పాను. ఎవరు చెప్పినా వినని జగన్‌కు ప్రజలు చక్కని పాఠం చెప్పారు. ఇకనైనా బుద్ధిగా ఉంటే మంచిది అని బుచ్చయ్య సూచించారు. ఇక, తనకు మంత్రి పదవి రాకపోవడంపైనా స్పందించారు.
మంత్రి పదవిని తాను 2014లోనూ ఆశించానని, ఇప్పుడు కూడా ఆశించానని.. బుచ్చయ్య అన్నారు. కానీ, ఈక్వేషన్లు, చంద్రబాబుకు ఉన్న ఆల్టర్నేట్ అంశాలు చూసుకుని తనకు ఇవ్వకపోయి ఉండొచ్చని అన్నారు. ఇదే తన చివరి ఎన్నికలని..ఈ విషయంలో రాజీ లేదని అన్నారు. చివరి దశలో అయినా.. మంత్రి అవ్వాలని కోరుకున్నట్టు చెప్పారు. దక్కకపోయినా.. ఫర్వాలేదని.. తన పనితాను చేసుకుని పోతానని తెలిపారు మంత్రిగా ఉంటేనే పనిచేయాలని అందరూ అనుకుంటే.. పార్టీ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates