టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు.. తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. అయితే.. ఇందులో స్పెషల్ ఏంటంటే.. చంద్రబాబు దంపతులు తమ కుమారుడు, పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కోసం తొలి ఓటు వేయాలని అనుకున్నారు. కానీ, స్వల్ప ఆలస్యంతో మూడో ఓటు వేయాల్సి వచ్చింది. మొత్తానికి సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారం భం కావడంతో ఇక్కడ భారీ స్పందన కనిపించింది.
ఉండవల్లిలోని 16వ నెంబరు పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా లోకేష్ దంప తులు కూడా ఇక్కడే ఓటేశారు. అయితే.. అప్పటికే ఓటర్లు భారీగా క్యూలైన్‌లోకి రావడంతో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రత్యేకంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, మంగళగిరిలో ఎటు చూసినా పోలింగ్ కేంద్రాలు ఉదయాన్నే కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా మహిళలు బారులు తీరారు. కేంద్రాల ముందు వేసిన టెంట్లు కూడా.. సరిపోనంతగా బారులు తీరడం గమనార్హం.
మొత్తానికి ఏపీలో ఎటు చూసినా.. ఉదయం 7 గంటలకే బూతుల్లో ఓటర్లు బారులు తీరారు. గతంలో ఇలాం టి పరిస్థితి కనిపించలేదు. అయితే.. దీనికి ప్రదాన కారణం..ఎండలు తీవ్రంగా ఉండడంతోపాటు కూలి పనులు చేసుకునేవారు త్వరగా ఓటేసి వెళ్లిపోవచ్చన్న ఉద్దేశం కూడా ఉండి ఉంటుందని ఒక అంచనా. లేకపోతే.. తొలి ఓటు వేయాలన్న కసి కూడా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు నెల్లూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో తోగరామ్ గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- పులివెందుల లోని భాకరాపేట లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు.