కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ పర్యటన. రెండు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న విజయవాడ రోడ్ షో. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేప థ్యంలో ఏపీలో బుధవారం చోటు చేసుకున్న ఈ రెండు అంశాలు.. రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూట మి ఏర్పాటు చేస్తున్న ప్రచార సభలకు హాజరవుతున్న ప్రధాని మోడీ.. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహిం చిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ కు చేరుకుని ఇక్కడ నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు.
రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు .. సుమారు నాలుగు కిలో మీటర్ల మేర నిర్వహించిన ప్రధాని రోడ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పాల్గొన్నారు. అదేవి ధంగా కూటమి పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ఐదుగురు ఎస్పీలు, 5 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఆసాంతం.. ప్రధాని మోడీ పర్యటనకు విశేష స్పందన లభించింది. ఇది రాజకీయంగా కూటమి పార్టీలకు జోష్ నింపింది. మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే జరిగి ప్రచారానికి తోడు ఈ రోడ్ షో మరింత ఊపు తెచ్చిందనే చర్చ సాగుతోంది. దీనిపై ఎక్కువ మంది ఆసక్తి చూపించడం గమనార్హం.
ఇక, మరో కీలక విషయం.. సీఎం జగన్ విదేశీ పర్యటన. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయ్యీ అవడంతోనే ఆయన విదేశాలకు వెళ్లి పోతున్నారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సతీసమేతంగా ఆయన రెడీ అయ్యారు. దీనికి సంబంధించి కోర్టులోనూ కూడా అనుమతి కోరారు. దీనిపై గురువారం కోర్టు తీర్పు చెప్పనుంది. అయితే.. ఇక్కడ దీనిపై కొంత నెగిటివ్‌గా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు అయ్యీ అవడంతోనే విదేశాలకు వెళ్లిపోవడం ఏంటి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత ఉండదా? మరో 20 రోజుల పాటు ప్రజల పరిపాలన ఎవరు చూడాలి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం.. మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు ఎండలో బాగా తిరిగి ప్రచారం చేశారు కదా.. కొంత రెస్ట్ అవసరం అందుకే వెళ్తున్నట్టున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించే వారు.. మాత్రం అన్నయ్య పని అయిపోయింది.. ముందే పెట్టేబేడా సర్దేస్తున్నాడు
అని కటువుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకున్నా ఈ రెండు విషయాలు బుధవారం నాటి ఏపీ రాజకీయాల్లో హైలెట్ కావడం గమనార్హం.