Political News

వదిన దగ్గర పవన్ 2 కోట్ల అప్పు

మొత్తానికి జనసేన అభిమానులు ఎదురు చూస్తున్న కార్యం పూర్తయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇది నామినేషన్ ర్యాలీనా.. విజయోత్సవ వేడుకా అన్న తరహాలో కిలోమీటర్ల కొద్దీ జనం, వాహనాలతో నిండిపోయి కన్నుల పండువగా సాగింది ఈ కార్యక్రమం. పవన్ పిఠాపురాన్ని ఎంచుకోవడానికి ముందు ఈ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఉండి, పవన్‌ కూటమి అభ్యర్థిగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాక కొన్ని రోజులు నిరసన స్వరం వినిపించి, ఆ తర్వాత తీరు మార్చుకున్న వర్మ.. జనసేనాని పక్కనే ఉండి నామినేషన్ వేయించడం విశేషం. హైదరాబాద్ నుంచి పవన్‌ను అభిమానించే సినీ ప్రముఖులు, అభిమానులు కూడా పిఠాపురానికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

ఇదిలా ఉంటే.. పవన్ అఫిడవిట్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇందులో పవన్ రూ.46 కోట్ల అప్పులు చూపించడం గమనార్హం. తాను వ్యక్తిగతంగా కొందరు వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులను పవన్ ‘పర్సనల్ లోన్’ రూపంలో ఇందులో పొందుపరిచారు. అందులో పవన్ వదినమ్మ, చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పేరు ఉండడం.. ఆమె నుంచి పవన్ రూ.2 కోట్ల అప్పు తీసుకున్నట్లు పేర్కొనడం విశేషం.

అంతే కాక ఇంకో 14 మంది నుంచి ఇలా పర్సనల్ లోన్ తీసుకున్నట్లు పవన్ పేర్కొన్నాడు. అందులో పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. త్రివిక్రమ్‌కు హోం బేనర్‌లా మారిన హారిక హాసిని క్రియేషన్స్ నుంచి పవన్ రూ.6.35 కోట్లు తీసుకున్నాడట. ఈ సంస్థలో పవన్ ‘అజ్ఞాతవాసి’ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్న మైత్రీ సంస్థ నుంచి రూ.3 కోట్లు తీసుకున్నాడట పవన్. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని నుంచి ప్రత్యేకంగా రూ.5.5 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.‘ఓజీ’ని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పవన్‌కు రూ.10 లక్షలు ఇచ్చింది.

This post was last modified on April 24, 2024 5:42 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

45 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago