స్లండాగ్ మిలియనీర్ ద్వారా బాలనటుడిగా పరిచయమైన దేవ్ పటేల్ దర్శకుడిగా మారి తీసిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సంచలన కంటెంట్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మన దేశంలో రిలీజ్ కాలేదు కానీ ఓవర్సీస్ లో దీనికి మంచి రెస్పాన్స్ రావడమే కాక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఏప్రిల్ లో ఇండియా విడుదల ప్లాన్ చేసుకున్నారు కానీ సెన్సార్ అడ్డంకుల వల్ల కుదరలేదు. మన ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తీసే కొన్ని అంశాలు ఉండటంతో లేనిపోని సమస్యలు వస్తాయనే కారణంతో పెద్ద ఎత్తున కత్తిరింపులు రికమండ్ చేశారని టాక్.
ఇదిలా సాగుతూ ఉండగానే హఠాత్తుగా మంకీ మ్యాన్ ఓటిటిలోకి వచ్చేసింది. అలా అని వెంటనే ఎందులో అని వెతికేయకండి. ఇంకో ట్విస్టు ఉంది. డిజిటల్ వెర్షన్ కేవలం యుఎస్, యుకె తదితర దేశాల ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్, యాపిల్ లాంటి మాధ్యమాల ద్వారా రెంటు కట్టి చూసే ఆప్షన్ ని అందించింది. ఒకవేళ మనం డబ్బులు కట్టి చూడాలన్నా అవకాశం లేదు. ఎందుకంటే సెన్సార్ పూర్తవ్వని సినిమా కాబట్టి. అయినా మనోళ్లు ఊరుకుంటారా. ఆన్ లైన్ సైట్ల ద్వారా హెచ్డి వెర్షన్ ని వెతికి మరీ చూసేస్తున్నారు. కొత్త సినిమాలకే తప్పని పైరసీ దీన్ని వదులుతుందా.
చూస్తుంటే మంకీ మ్యాన్ ఇక్కడికి రావడం అనుమానంగానే ఉంది. హనుమాన్ జయంతి రోజే దీని డిజిటల్ వెర్షన్ రావడం గమనించాల్సిన విషయం. కథ విషయానికి వస్తే యాతన అనే నగరంలో కోతి ముఖాన్ని పోలిన మాస్కు వేసుకుని హీరో రాత్రిళ్ళు మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటాడు. వేశ్య అయిన ఓ అమ్మాయిని కాపాడే క్రమంలో పోలీసులతో తగవు తెచ్చుకుంటాడు. ఇతని చర్యల వెనుక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. వివాదాస్పదం అనిపించే విషయాలు బోలెడున్నాయి. చూడాలి మరి ఈ కోతి మనిషిని మన థియేటర్లలో చూపిస్తారో లేక స్మార్ట్ స్క్రీన్ కి పరిమితం చేస్తారో.
This post was last modified on April 23, 2024 7:28 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…