పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న పేరు. గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ ఎన్నారై తన అఫిడవిట్లో రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఆయన కంటే ఆస్తిపరులు ఎంతోమంది ఉండొచ్చు కానీ.. అదంతా బినామీల పేరిట, నల్లధనం రూపంలో ఉండొచ్చు. కానీ పెమ్మసాని మాత్రం యుఎస్‌లో వ్యాపారం చేసి సంపాదించిన ఆస్తులను అఫిడవిట్లో చూపించుకున్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మసాని చేస్తున్న ప్రసంగాలు, ఆయన కార్యకలాపాలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటించి.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఎక్కడికక్కడ ఆగిపోయాయో చూపించారు.
జగన్ సర్కారు కక్షగట్టి ఆపేసి నిరుపయోగంగా మార్చేసిన అనేక నిర్మాణాలను ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో చూస్తే వైసీపీ వాళ్లు గ్రాఫిక్స్ అని, అవినీతి మయం అని చెప్పే చోట ఇన్ని నిర్మాణాలు జరిగాయా అని ఆశ్చర్యం కలగక మానదు. ఐతే నిన్నగాక మొన్న వచ్చిన పెమ్మసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతిలో జగన్ సర్కారు చేసిన నిర్వాకాన్ని ఇలా కళ్లకు కట్టినట్లు చూపించి జనాల్లో కదలిక తెస్తుంటే.. ఐదేళ్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ కో ఇంత ఎఫెక్టివ్‌గా ఈ విషయాన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోయింది అన్నది ప్రశ్నార్థకం.
అమరావతి విషయంలో అనేక దుష్ప్రచారాలు చేసి బాబు మీద దాన్నొక మరకలా వేసేశారు వైసీపీ నేతలు. కొన్నేళ్ల ముందే చంద్రబాబు ఇదే తరహలో అమరావతిలో పర్యటించి జనాలకు తాను ఏ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానో చూపించి.. అమరావతిని జగన్ సర్కారు ఎలా నాశనం చేసిందో తెలియజెప్పాల్సింది. ఈ విషయంలో బాబు అండ్ కో ఫెయిరలయ్యార్నది వాస్తవం.
This post was last modified on April 24, 2024 5:48 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…