ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్‌కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం జగన్‌కే చెల్లింది.
ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తగ్గట్లేదు. దీంతో విసిగి వేసారిపోయిన పవన్.. ఆ మధ్య తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఆ పార్టీతో కలిసి నిర్వహించిన తొలి ఉమ్మడి సభలో జగన్‌కు వేసిన పంచ్ చర్చనీయాంశం అయింది. తనకు అయింది మూడు పెళ్లిళ్లు అయితే.. నాలుగో పెళ్లాం గురించి జగన్ మాట్లాడతాడని.. నా నాలుగో పెళ్లాం నువ్వేనా రా అంటూ పవన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని అందిపుచ్చుకుని జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జగన్‌ని నాలుగో పెళ్లాం.. వదినమ్మ అంటూ.. ఒక రేంజిలో ట్రోల్ చేశారు. టిట్ ఫర్ టాట్ అంటూ జగన్‌కు ఆయన భాషలోనే పవన్ భలే సమాధానం ఇచ్చాడంటూ ఆయనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఆ తర్వాత కూడా జగన్ మారలేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ప్రస్తావన వచ్చినపుడల్లా పెళ్లిళ్ల వ్యవహారమే మాట్లాడుతున్నారు. దీంతో పవన్ మరోసారి జగన్‌కు పంచ్ ఇచ్చాడు.
ఇంతకుముందు జగన్‌ను నాలుగో పెళ్లాం అన్న పవన్.. ఈసారి ‘పరదాల మహరాణి’ అంటూ కొత్త బిరుదు ఇచ్చాడు. పరదాల మహరాణిని కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పాపం ఇబ్బంది పెట్టారంటూ జగన్‌కు వ్యతిరేకంగా అక్కడ జరిగిన నినాదాలు చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించాడు. ఐతే రాష్ట్రాన్నేలే పరదాల మహరాణి కక్ష పెట్టేసుకుంటుందని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించడం గమనార్హం. ఈ కామెంట్స్‌లో ‘పరదాల మహరాణి’ అనే మాటను తీసుకుని జనసైనికులు మరోసారి జగన్‌ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
This post was last modified on April 21, 2024 4:50 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…