కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా తన అన్న సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా పేరు చెప్పకుండానే.. చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. గిఫ్ఠ్ ఇచ్చినట్టుగా భావిస్తారని షర్మిల అన్నారు. శనివారం కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షర్మిల.. అనంతరం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. దీనిలో తన అన్న సీఎం జగన్‌కు తాను రూ.82 కోట్ల రూపాయల అప్పు ఉన్నానని షర్మిల తెలిపారు.
అదేవిధంగా తన వదిన, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నుంచి రూ.19 లక్షలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్‌లో షర్మిల పేర్కొన్నారు. ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అదేంటి.. ఆస్తుల పంపకంలో తేడా వచ్చిందని.. అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అప్పులు ఇవ్వడం ఏంటనే చర్చ తెరమీదికి వచ్చింది. సీఎం జగన్‌పై కొందరు విమర్శలు కూడా చేశారు. సొంత చెల్లికి అప్పులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయంపై తాజాగా షర్మిల స్పందించారు. సమాజంలో చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. కానీ కొందరు వ్యక్తులు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఒక్క కొసరు(కొంచెం ఎక్కువ) చెల్లెళ్ళ కు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారు. ఈ విషయం కుటుంబానికి, దేవుడికి తెలుసు
అని వ్యాఖ్యానించారు.
దీనిని బట్టి.. షర్మిల తనకు అప్పుగా చూపించిన నిధులపై ఒక క్లారిటీ వచ్చింది. అదే సమయంలో జగన్ ఇచ్చిన సొమ్ముపైనా క్లారిటీ వచ్చింది. ఏదేమైనా.. మనస్పూర్తిగా అయితే.. జగన్ ఇవ్వలేదనేది షర్మిల ఆరోపణగా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో షర్మిల అప్పుగా తీసుకున్న మొత్తం 82 కోట్ల పైచిలుకు మొత్తంపై వైసీపీ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. అది అప్పా.. లేక మరో విదమైన సొమ్మా.. అసలు షర్మిల ఎప్పుడు తీసుకున్నారు? అనేది చర్చ. ఇది ఇంకా అప్రస్తుతంగానే ఉంది.
This post was last modified on April 21, 2024 9:23 pm
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా…