అవును ఛాతి విరుచుకుని మరీ టాలీవుడ్ కాలర్ ఎగరేస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాని కనీసం డబ్బింగ్ రూపంలో అయినా మంచి రిలీజ్ ఇచ్చేందుకు ఇష్టపడని ఉత్తరాది నిర్మాతలు ఇప్పుడు హక్కుల కోసం ఎగబడే పరిస్థితి వచ్చింది. మన స్టార్ హీరో ఉన్నాడంటే చాలు గెద్దలా ఎగరేసుకుపోయేందుకు ఓటిటిలు కాచుకుని ఉంటున్నాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విడుదల తేదీ ప్రకటించడం ఆలస్యం ఒక్కసారిగా ప్రమోషన్లు ఊపందుకుంటాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు రెండు వేల కోట్లు ఎక్కడికి పోవు.
బాలీవుడ్ మార్కెట్లో ‘పుష్ప 2 ది రూల్’ మీదున్న క్రేజ్ చూస్తే మతి పోవడమనే మాట చిన్నదే. హక్కుల అమ్మకాల గురించి షాకింగ్ వార్తలు వస్తున్నాయి కానీ ఏది నిజమో ఇంకా నిర్ధారణగా చెప్పలేం కాబట్టి కొంత కాలం ఎదురు చూడాలి. బన్నీకి భయపడే అజయ్ దేవగన్ సింగం ఆగస్ట్ 15 నుంచి తప్పుకోవడం ఓపెన్ సీక్రెట్. కనీసం టీజర్ రాకపోయినా ‘గేమ్ ఛేంజర్’ మీదున్న హైప్ మాములుగా లేదని డిస్ట్రిబ్యూటర్స్ టాక్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ మూవీ కావడంతో అటు నార్త్ లోనూ మంచి రేట్లు పలుకుతోంది. దర్శకుడు శంకర్ బ్రాండ్ తో పాటు దిల్ రాజు నిర్మాణం ఆకర్షణగా నిలుస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర పార్ట్ 1’ హిందీ రైట్స్ బాహుబలి పంపిణి చేసిన కరణ్ జోహార్, అనిల్ తదాని లాంటి పెద్ద చేతులు కొనడం దానిమీదున్న హైప్ కి నిదర్శనం. అక్టోబర్ 10 నాటికి ఇది పీక్స్ కి చేరడం ఖాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ‘ఓజి’ సైతం అంచనాల పరంగా జ్వరం తెప్పించే రేంజ్ లో బిజినెస్ చేయబోతోంది. నాని ‘సరిపోదా శనివారం’ని తక్కువంచనా వేయడానికి లేదు. దూరంలో ఉన్నా ది రాజా సాబ్, విశ్వంభర, స్వయంభు, ఎస్ఎస్ఎంబి 29 చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు బ్రేకుల్లేని బండిలా అలా పోతూనే ఉంటుంది.
This post was last modified on April 21, 2024 10:12 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…