Political News

తెలంగాణ సర్… కాంగ్రెస్ లేట్ చేసిందా?

తెలంగాణ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రిజ‌విజ‌న్(స‌ర్‌) ప్ర‌క్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు సార్లు కూడా పొడిగించారు. కానీ, అప్ప‌ట్లో వ్య‌క్తం చేయ‌ని సందేహాలు.. అప్ప‌ట్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి మ‌రిచిపోయిన తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌.. అంతా అయిపోయిన త‌ర్వాత‌.. ఇప్పుడు నింపాది గా రియాక్ట్ అయ్యారు. ఎన్నిక‌ల సంఘం.. తెలంగాణ కు అన్యాయం చేసింద‌ని ఆయ‌న ల‌బోదిబోమంటున్నారు. నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగించార‌ని.. ఇది అన్యాయ‌మ‌ని మ‌హేష్ కుమార్ గ‌గ్గోలు పెట్టారు.

రేవంత్ చెప్పినా..

నిజానికి స‌ర్ ప్ర‌క్రియ ప్రారంభానికి ముందే.. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు మూడు సార్లు అలెర్ట్ చేశారు. స‌ర్ ప్ర‌క్రియ‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల‌ని హెచ్చ‌రించారు. బీఎల్ ఏల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కూడా ఆయ‌న సూచించారు. కానీ, ఆనాడు పెద్ద‌గా నాయ‌కులు వినిపించుకోలేద‌న్న‌ది కూడా సీఎం నోటి నుంచే ఇటీవ‌ల వినాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు స‌ర్ ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని.. రాష్ట్ర ఎన్నికల ప్ర‌ధానాధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాదు.. 92 ల‌క్ష‌ల ఓట్ల‌కు సంబంధించి నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు కూడా ఆయ‌న తెలిపారు.

ఈ వ్య‌వ‌హారం అధికార పార్టీని ఇరుకున ప‌డేసింది. 92 ల‌క్ష‌ల ఓట్ల ప‌రిస్థితిపై మ‌హేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన బీఎల్ వో(బూత్ స్థాయి అధికారి)లు ఎవ‌రి ఇంటికీ వెళ్ల‌లేద‌ని.. లెగ్ వ‌ర్క్ చేయ‌లేద‌ని ఆరోపించారు. కేవ‌లం త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న ఆరోపించారు. వ‌ల‌స కూలీల ఓట్ల‌ను భారీగా తీసేశార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. ఇక‌, 2002 నాటి ఓట‌ర్ల జాబితా విష‌యంపైనా గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశౄరు.

నిజానికి దేశ‌వ్యాప్తంగా స‌ర్ ప్ర‌క్రియ‌లో 2002 నాటి జాబితానే కీల‌కంగా మారింది. ఈ విష‌యంపై గ‌తంలోనూ వివాదం వ‌చ్చినా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తోసిపుచ్చింది. 2002 ప్ర‌కార‌మే జాబితాల‌ను రెడీ చేస్తామ‌ని చెప్పింది. కానీ.. మ‌హేష్ కుమార్‌కు ఇప్పుడు ఈవిష‌యం గుర్తుకు వ‌చ్చిన‌ట్టుగా స్పందించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ఎంతమందికి అందుబాటులో ఉంది?కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలాగే ఎన్నికల సంఘాన్ని కూడా తన జేబు సంస్థగా మార్చుకుంది. అని ఆయ‌న నిప్పులు చెరిగారు. కానీ.. వాస్త‌వానికి రెండు నెల‌ల కింద‌టే ఆయ‌న స్పందించి ఉంటే ఇప్పుడు చేతులు కాల‌కుండా ఉండే ప‌రిస్థితి ఉండేదిక‌దా.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 18, 2026 11:18 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

7 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago