Movie News

రామ్ పోతినేని 23… ఊహించని ఆర్టిస్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్ లో ఒక ఎపిసోడ్ ని ఇరవై నాలుగు గంటల పాటు నాన్ స్టాప్ గా చిత్రీకరణ చేయడం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. రామ్ చాలా కసితో పని చేస్తున్నాడని, ఇన్ని ఫ్లాపులు చవి చూశాక తన హిట్టు తానే ఇచ్చుకున్నాననే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించడం కోసం ఒళ్ళు హూనం చేసుకుంటున్నాడని సమాచారం.

ఇదిలా ఉండగా హీరోతో సమానంగా కథలో కీలకంగా వ్యవహరించే ఒక పాత్ర కోసం ముందు అనుకున్న ఎస్జె సూర్య స్థానంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ని ఫైనల్ చేసినట్టు తెలిసింది. రెమ్యునరేషన్ విషయంలో సూర్య డిమాండ్ వల్లే ఈ మార్పు జరిగినట్టు వినికిడి. దానికి తోడు సరిపోదా శనివారం తర్వాత ఇతను చాలా తెలుగు సినిమాల్లో కనిపించేశారు. అందుకే ఫ్రెష్ గా అనిపించే ఉద్దేశంతో రితేష్ దేశముఖ్ కి స్క్రీన్ టెస్ట్ చేసి అంతా ఓకే అనుకున్నాక లాక్ చేసుకున్నారట.

రితేష్ భార్య జెనీలియా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇటీవలే జూనియర్ లో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ పనవ్వలేదు. రామ్ తో రెడీ టైం నుంచే జెనీలియాకు అనుబంధం ఉంది. తెలుగు సినిమాల్లో సరైన బ్రేక్ దక్కితే కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందనే ఆమె సూచనను అనుసరించే రితేశ్ ఎస్ చెప్పినట్టు తెలిసింది. ఈ మధ్య బాలీవుడ్ యాక్టర్ల ప్రవాహం టాలీవుడ్ లో పెరుగుతోంది. అర్జున్ రామ్ పాల్, బాబీ డియోల్, జాకీ శ్రోఫ్, అనిల్ కపూర్ లిస్టులో ఇతను కూడా చేరబోతున్నాడు.

విడుదల తేదీని రామ్ ఇంకా ఖరారు చేసుకోలేదు. దాన్ని ఫిక్స్ చేసుకుని లేనిపోని ఒత్తిడి తీసుకోవడం ఇష్టం లేక షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నాడని టాక్. నివేత పేతురాజ్ హీరోయిన్ గా ఎంపికైన విషయం యూనిట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న రాపో 23 యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. రామ్ గెటప్ కూడా గతంలో ఎన్నడూ చూడనంత విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

This post was last modified on August 18, 2026 6:25 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

37 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago