Movie News

మెగా క్లాష్… మావయ్య VS మేనల్లుడు ?

2027 సంక్రాంతి అయిదు నెలల ముందే టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేమంటే మేమంటూ ఎవరికి వారు పోటీ పడి పండక్కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీగా ఉండటంతో బయ్యర్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే అయినా మూడు కంటే ఎక్కువ సినిమాలు క్లాష్ అవ్వడం వల్ల టాక్ బాగున్న కొన్ని చిత్రాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్నాయని వాపోతున్నారు. అయినా ఇది ఆగేలా లేదు.

ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ డేట్ జనవరి 12 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా వాయిదాల పర్వంలో నలిగిపోతున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద నిర్మాత నిరంజన్ రెడ్డి విపరీతంగా ఖర్చు పెట్టారు. రికవరీ కావాలంటే సంక్రాంతినే మంచి ఆప్షన్ గా భావించి ప్రకటన ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా వర్కౌట్ అయ్యే ఈ సీజన్ లో సంబరాల ఏటిగట్టు లాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ నెగ్గాలంటే యుద్ధమే చేయాలి.

ఇదిలా ఉండగా చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న మెగా 158 సంక్రాంతినే టార్గెట్ చేసుకుంటోందని విశ్వసనీయ సమాచారం. కాకా (కదిరి కాకాజీ) టైటిల్ ఇప్పటికే ప్రచారంలోకి వచ్చేసింది. ఇది నిజమా కాదానేది ఆగస్ట్ 22 తేలిపోతుంది. వాల్తేరు వీరయ్య హిట్ సెంటిమెంట్ రిపీట్ చేసే ఉద్దేశంతో మెగా 158ని పండగ బరిలో దింపాలనేది బాబీ కొల్లి లక్ష్యం. దానికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డేట్ లేకుండా సంక్రాంతి రిలీజ్ అని టీజర్ లో పెట్టారట.

ఇదంతా బాగానే ఉంది కానీ నిజంగా మేనమామతో మేనల్లుడు క్లాష్ అవుతాడానేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎదురుగా చిరంజీవి బొమ్మని పెట్టుకుని ఫ్యాన్స్ సాయి దుర్గ తేజ్ కి అంతే సమాన మద్దతు ఇవ్వడం కొంచెం కష్టమే. తేజు సోలోగా వస్తే ఇబ్బంది లేదు. పాజిటివ్ టాక్ ని మోసి వసూళ్లకు దోహదం చేస్తారు. అయితే చిరు బర్త్ డే తర్వాతే ఈ క్లాష్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. ఏం పర్లేదు రెండూ ఆడతాయని రిస్క్ చేస్తారేమో చూడాలి. వీటితోపాటు వెంకటేష్ – రావిపూడి, రవితేజ – శ్రీవిష్ణు, శర్వానంద్ జార్జ్ క్రిష్, బాలయ్య 111, మహాకాళి, రజినీకాంత్ ధర్మన్ కూడా పండగకే రెడీ అవుతున్నాయి. 

This post was last modified on August 18, 2026 5:42 pm

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

55 minutes ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

3 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago