Movie News

అసలు గుడ్ న్యూస్ ఎప్పుడు నిఖిల్

టాలీవుడ్ లో కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల సంకట స్థితి అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తేల్చకుండా, అభిమానుల అయోమయాన్ని కొనసాగిస్తూ నిత్యం సంఘర్షణ పడుతూనే ఉన్నాయి. వాటిలో స్వయంభు ఒకటి. షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. అప్పట్లో ఫిబ్రవరి రిలీజ్ అంటూ ఒక డేట్ ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ అన్నారు. అటుపై ఇంకే ఊసు లేదు. వాయిదాలు పడుతూనే ఉన్నాయి కానీ టీమ్ సైలెంట్ గా ఉండిపోయింది. అదిగో ఇదిగో అనడం తప్పించి నిఖిల్ క్లియర్ గా చెప్పడం లేదు.

స్వయంభు మూవీ నిఖిల్ కు చాలా ప్రతిష్టాత్మకంగా మారిన సినిమా. కార్తికేయ 2 నార్త్ లోనూ బ్లాక్ బస్టర్ కొట్టి గుర్తింపు తెచ్చింది. దాన్ని స్థిరపరిచేది ఈ సినిమానే అన్నది తన స్థిర నమ్మకం. అయితే ఓటిటి డీల్ ఇంకా అవ్వకపోవడం వల్లనో లేక విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఇంకా ఆశించిన స్థాయిలో రావడం లేదనో కారణం ఏదైతేనేం నెలలు గడిచిపోతున్నాయి కానీ అసలైన గుడ్ న్యూస్ మాత్రం బయటికి రావడం లేదు. ఫ్యాన్స్ ప్రశ్నకు నిఖిల్ రెడీ అని రెడీ మేడ్ సమాధానం ఇస్తున్నాడు.

2026లో ఇంకో  నాలుగు నెలలు మాత్రమే ఉన్నాయి. ఇరుముడి, టాక్సిక్, ప్యారడైజ్, సర్దార్ 2, ఎపిక్, ఆదర్శ కుటుంబం, వీసా, జైలర్ 2, విశ్వంభర, రణబాలి, రామాయణ, ఫౌజీ, కింగ్ అంటూ చిన్నా పెద్ద సినిమాలు వరసగా క్యూ కట్టి ఉన్నాయి. అటు సంక్రాంతి ఆల్రెడీ పిచ్చ టైట్ అయిపోయింది. మరి స్వయంభు మనసులో ఏముందో అంతు చిక్కడం లేదు. సెప్టెంబర్ ఆప్షన్ బాగానే ఉంది కానీ ప్యారడైజ్ కన్నా కనీసం రెండు వారాల ముందు వస్తే మంచి వసూళ్లు అందుకోవచ్చు.

ఇదంతా అయ్యేపని కాదనుకుంటే 2027 మార్చి లేదా అటుపై సమ్మర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే బజ్ తగ్గినట్టు కనిపిస్తున్న స్వయంభుకి భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం సమకూర్చగా రవి బస్రూర్ సంగీతం అందించారు. సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లు కాగా క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడిన సంబరాల ఏటిగట్టు జనవరి 12 తీసేసుకుంది. మరి స్వయంభు ఏం చేస్తాడో చూడాలి. 

This post was last modified on August 18, 2026 7:53 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

1 hour ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago