గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత సఖ్యతతో వంశీతో జగన్ ఉండడం లేదా? ఒక మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ కూడా జగన్ ను ఒక సాధారణ కార్యకర్తలాగా బారికేడ్ల అవతల నుంచి కలుస్తున్న వైనం చూస్తుంటే వంశీకి, జగన్ కు మధ్య గ్యాప్ వచ్చినట్లు వస్తున్న పుకార్లు నిజం అనిపించక మానదు.
ఇటీవల గన్నవరం విమానాశ్రయం దగ్గర జగన్ ను కలిసేందుకు వల్లభనేని వంశీ వెళ్లారు. అయితే, జనం మధ్యలో బారికేడ్లకు అవతల వంశీ నిలబడి జగన్ ను పలకరించారు. వాస్తవానికి వంశీనే నేనిక్కడున్నాను అంటూ జగన్ కు అభివాదం చేసిన తర్వాత జగన్ ఆయన దగ్గరకు వెళ్లారు. వంశీ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా…జగన్ మాత్రం అయిష్టంగా రెండు ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరే ఏదో తొందరలో జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వెళ్లారు అనుకోవడానికి లేదు.
ఇప్పుడే కాదు..కొద్ది రోజులగా వంశీతో వన్ టు వన్ మీటింగ్ లోగానీ, ఇతర సందర్భాల్లోగానీ వంశీ కనబడలేదు. మిగతా నేతలను కలుస్తున్న జగన్…వంశీని మాత్రం కావాలనే దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత వంశీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? అందుకే వంశీని జగన్ దూరం పెడుతున్నారా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ గ్యాప్ నిజమా..లేేక కల్పిత ప్రచారమా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
This post was last modified on August 18, 2026 6:19 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…