Political News

కుప్పంలో చంద్రబాబుకి రికార్డు స్థాయి మెజార్టీ.?

‘వై నాట్ కుప్పం’ అని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అనగలిగారు.? అప్పటికి పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా కనిపించాయి మరి.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, కుప్పంలో వైసీపీ మార్కు రాజకీయం చూసి ఆశ్చర్యపోయారు, ఆందోళన చెందారు కూడా.! కానీ, ఎన్నికల నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు కొన్ని బెడిసికొట్టాయి. కొన్ని వైసీపీకే రివర్స్ ఎటాక్ ఇచ్చాయి కూడా.

ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు కూడా. భారీ ర్యాలీతో ఈ నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది. నిజానికి, టీడీపీ కూడా ఈ స్థాయి జన సందోహాన్ని ఊహించి వుండదు.
మారిన సమీకరణాల ప్రకారం చూస్తే, కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రికార్డు స్థాయి మెజార్టీని కైవసం చేసుకునేలా వున్నారు.

‘కుప్పంలో వైసీపీ అభ్యర్థి గెలిస్తే, మంత్రి అవుతారు..’ అని కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ జగన్ చేసిన ప్రకటన బెడిసి కొట్టింది. ‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. ఇంకోసారి కుప్పం నియోజకవర్గానికే ముఖ్యమంత్రి పదవి వస్తుంది..’ అని కుప్పం ప్రజానీకం అంటున్నారు.

క్రమంగా వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం తాలూకు జోరు కూడా తగ్గిపోయింది. గతంలోలా వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పంపై ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. ఆయనకు సొంత నియోజకవర్గంలో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయ్.

This post was last modified on April 20, 2024 10:53 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

22 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago