Political News

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు లెక్క‌లేక‌పోవ‌డం అత్యంత సీరియ‌స్ ప‌రిణామంగా పేర్కొంది. ముఖ్యంగా హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ పై హైకోర్టు మ‌రింత తీవ్రంగా స్పందించింది. ఆయ‌న తీరు అత్యంత దారుణంగా ఉంద‌ని పేర్కొన్న న్యాయ‌స్థానం.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ పోస్టు నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. కోర్టు అంటే రంగ‌నాథ్‌కు ఎంత మాత్రం లెక్క లేకుండా పోయింద‌ని న్యాయ‌స్థానం పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది?

హైడ్రా వ్య‌వ‌స్థ ప్రారంభం నుంచి కూడా అనేక విమ‌ర్శ‌లు దీని చుట్టూ తిరుగుతున్నాయి. సెల‌వు రోజులు, కోర్టులు ప‌నిచేయ‌ని రోజులు చూసుకుని తెల్ల‌వారు జామున‌, అర్ధ‌రాత్రి వేళ క‌ట్ట‌డాల‌ను కూల్చేయ‌డంపై గ‌తంలోనూ హైకోర్టు.. హైడ్రాపై నిప్పులు చెరిగింది. ఈ క్ర‌మంలోనే ఒక‌ద‌శ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను కోర్టుకు కూడా పిల‌వాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు రంగ‌నాథ్ పై 63 కోట్లు ధిక్క‌ర‌ణ పిటిష‌న్లు న‌మోద‌య్యాయి. వీటిపై విచార‌ణ చేయాల్సి ఉంది. అయితే.. కోర్టులు ఇచ్చే ఆదేశాల‌ను రంగ‌నాథ్ ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

తాజా కేసు ఏంటంటే..

తాజాగా  మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి హైకోర్టు గ‌తంలో కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ భూముల జోలికి పోవ‌ద్ద‌ని..త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కు వేచిచూడాల‌ని ఆదేశించింది. అయితే.. హైడ్రా అధికారులు మాత్రం కోర్టు ఉత్త‌ర్వులు ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ ప‌ని తాము చేసేశారు. దీంతో `శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌` కంపెనీ.. కోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైడ్రా ఉల్లంఘించింద‌ని పేర్కొంటూ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిలో ప్ర‌తివాదిగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను పేర్కొంది. ఈ పిటిష‌న్‌పై ప‌లు మార్లు విచారించిన హైకోర్టు రంగ‌నాథ్ ను కోర్టుకు రావాల‌ని.. వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ క్ర‌మంలో ఆయ‌న కోర్టుకు రాక‌పోయిన‌ప్ప‌టికీ.. న్యాయ‌స్థానానికి లిఖిత పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కోర్టుల‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. మ‌ల్కాజిగిరి ప‌రిధిలో భూముల జోలికి పోలేద‌ని తెలిపారు. అయితే.. దీనిపై గ‌తంలోనే కోర్టు అమిక‌స్ క్యూరీ ద్వారా క్షేత్ర‌స్థాయి నివేదిక తెప్పించుకుని వాస్త‌వాలు ప‌రిశీలించింది. తాజాగా సోమ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో రంగ‌నాథ్ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయిన న్యాయ‌మూర్తులు.. ఆయ‌న‌కు కోర్టులంటే లెక్క‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. త‌క్ష‌ణ‌మే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని  ఆదేశించింది. 

This post was last modified on July 27, 2026 6:37 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

8 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

10 hours ago