Movie News

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన రాజ‌మౌళి మీద కూడా అనేక కాపీ ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రో అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌నైతే సోష‌ల్ మీడియా జ‌నాలు కాపీ మాస్ట‌ర్ అని అంటుంటారు. ఆయ‌న ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన సినిమాల‌కు తోడు.. డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి క‌నిపిస్తుంది.

ఎపిసోడ్ల‌కు ఎపిసోడ్ల‌ను కాపీ చేసి పెట్టేస్తాడంటూ నెటిజ‌న్లు ఆయ‌న్ని ట్రోల్ చేస్తుంటారు. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్‌కు ఫ్రీమేక్ అంటూ అజ్ఞాత‌వాసి మీద ఆరోప‌ణ‌లు రావ‌డం, స్వ‌యంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడే ఈ మాట చెప్ప‌డం అప్ప‌ట్లో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇంకా త్రివిక్ర‌మ్ తీసిన అనేక సినిమాల్లో క‌థ‌లు, స‌న్నివేశాల మీద ఇలాంటి ఆరోప‌ణ‌లున్నాయి.

ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు తీస్తున్న ఆద‌ర్శ‌కుటుంబం చిత్రం విడుద‌ల‌కు ముందే ఈ కాపీ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. అర్జున్ న‌టించిన త‌మిళ చిత్రం బ్లాస్ట్ క‌థ‌కు, దీనికి ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయంటూ ఆ మ‌ధ్య జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. బ్లాస్ట్ రిలీజ‌య్యాక క‌థ‌లో మార్పులు చేర్పులు జ‌రిగిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు ఆద‌ర్శ కుటుంబం నుంచి రిలీజవుతున్న కొత్త పోస్ట‌ర్లు, హీరో క్యారెక్ట‌ర్ టీజ‌ర్ చూశాక నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల హాలీవుడ్ కంటెంట్‌తో పోలిక‌లు పెడుతున్నారు.

ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అనే అమెరిక‌న్ టీవీ సిరీస్ ఆధారంగా ఈ సినిమా తీశార‌ని కొంద‌రంటుంటే.. మ‌రికొంద‌రేమో వుయ్ ఆర్ ద మిల్ల‌ర్స్ అనే ఓ హాలీవుడ్ మూవీతో దీన్ని పోలుస్తున్నారు. ఆ సిరీస్‌, ఈ సినిమాలోని పాత్ర‌ల‌కు.. ఆద‌ర్శ కుటుంబంలోని క్యారెక్ట‌ర్ల‌కు లింక్ పెట్టి.. ర‌క‌ర‌కాల థియ‌రీలు వండుతున్నారు. కాపీ కొట్ట‌డ‌మో, స్ఫూర్తి పొంద‌డ‌మో లేకుండా త్రివిక్ర‌మ్ సినిమానే తీయ‌డ‌న్న‌ట్లుగా నెటిజ‌న్లు ఆయ‌న కొత్త చిత్రాన్ని మొద‌ట్నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మ‌రి ఈ ట్రోల్స్‌కు స‌మాధానంగా ఒరిజిన‌ల్ సినిమా తీసి త్రివిక్ర‌మ్ అంద‌రికీ స‌మాధానం చెబుతాడేమో చూడాలి.

This post was last modified on July 27, 2026 9:57 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

48 minutes ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

5 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

7 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

8 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

10 hours ago