Movie News

పారిజాత పర్వం రిపోర్ట్

కంటెంట్ తప్ప ఇంక దేన్నీ నమ్ముకోవడానికి వీల్లేని చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే గండంగా మారిన తరుణంలో పారిజాత పర్వం అంతో ఇంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. సునీల్, హర్ష చెముడు లాంటి తెలిసిన క్యాస్టింగ్ తో పాటు యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వచ్చిన చైతన్య రావు హీరోగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందింది. ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేశారు. నిన్న బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పోటీ ఉన్నప్పటికీ కాస్త దృష్టిలో ఉన్నది ఈ మూవీనే. వెరైటీ టైటిల్ తో వచ్చిన పారిజాత పర్వం ఎలా ఉందంటే.

డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో కాళ్లరిగేలా తిరుగుతున్న చైతన్య(చైతన్య రావు)కు అవమానాలు తప్ప అవకాశాలు రావు. ఎందరు ఎగతాళి చేసినా స్నేహితుడు హర్ష(హర్ష చెముడు)నే హీరోగా పెట్టి తీయాలని కంకణం కట్టుకుంటాడు. భీమవరం నుంచి వచ్చి గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన బార్ శీను(సునీల్) బయోపిక్ ని ఎంచుకుంటాడు. డబ్బు కోసం ఓ నిర్మాత(శ్రీకాంత్ అయ్యంగార్)భార్యను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా శీనుతో పాటు ఇతర గ్యాంగులు రంగంలోకి దిగుతాయి. అయోమయం మొదలవుతుంది. చివరికి చైతన్య అనుకున్నది సాధించాడా లేదా అనేది స్టోరీ.

ఫస్ట్ హాఫ్ నుంచే విపరీతమైన సాగతీతతో పాటు అక్కర్లేని సన్నివేశాలతో దర్శకుడు సంతోష్ సహనానికి పెద్ద పరీక్ష పెడతాడు. ఆసక్తికరంగా ఉండాల్సిన స్క్రీన్ ప్లే నవ్వించని కామెడీతో విసిగిస్తుంది. పాత్రల తీరుతెన్నులు లాజిక్ కి దూరంగా చాలా సిల్లీగా అనిపిస్తాయి. దానికి తోడు అక్కడక్కడా నవ్వించిన హర్ష ఒకదశ దాటాక ఓవర్ అనిపించడం ముమ్మాటికీ క్యారెక్టరైజేషన్ లోపమే. సంగీతంతో సహా సాంకేతిక విభాగాలన్నీ గందరగోళం చేశాయి. సునీల్ ఒక్కడే కొంత ఊరట. కిడ్నాప్ డ్రామా తీయడం ఒక కళ. లేకపోతే ఆడియన్స్ ఇలాంటివి బ్రోచేవారెవరురా అనకుండా భరించేదెలాగరా అనేస్తారు.

This post was last modified on April 20, 2024 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని టీడీపీ ..!

టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆదిమూలంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా వైసీపీ పుంజుకునే అవ‌కాశం వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రిగింది. నిన్న మొన్న‌టి…

2 hours ago

బెంగళూరును ముంచెత్తిన గోట్.. గొడవ గొడవ

బెంగళూరులో స్థానికేతరుల ఆధిపత్యం గురించి లోకల్స్ గొడవ చేయడం ఎప్పట్నుంచో ఉన్న సమస్య. ఈ మధ్య ఈ గొడవ మరింత…

5 hours ago

దేవర ఊపు మామూలుగా లేదు

వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయాక ‘కల్కి’ జోరుతో కొంచెం కోలుకుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ కొంత ఉత్సాహాన్నిచ్చింది. భారీ వర్షాల్లోనూ…

5 hours ago

పొలిటిక‌ల్ టాక్‌- జ‌గ‌న్ కంటే ష‌ర్మిల న‌యం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాలా వెనుక‌బ‌డి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం…

6 hours ago

రాజ్‌కే ఆమె 70 లక్షలిచ్చిందట

ఈ మధ్య కొన్ని వారాల పాటు యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే.…

6 hours ago

దేవర కొత్త పాట.. ఇటు విమర్శలు అటు వైరల్

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘దేవర’ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు…

6 hours ago