జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు బయట పడకపోవచ్చు కానీ ఫ్రెండ్ షిప్ అంత సులభంగా మారిపోయేది కాదు. సినిమాలో ఒకరి కోసం ఒకరు ప్రాణాలకు తెగించి ఎలాంటి పోరాటాలు చేశారో చూశాం. అదేంటో నిజ జీవితంలో కూడా కాకతాళీయంగా రామరాజు, భీంలకు కొన్ని విషయాల్లో సారూప్యత వస్తోంది. అనుకోకుండా జరిగినా ఇది ఆశ్చర్యకరంగా ఉంది.
ఇవాళ సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరిన తారక్ కు నిపుణులైన వైద్యులు తక్షణం ట్రీట్ మెంట్ చేశారు. ఎనిమిది వారాల పాటు అంటే రెండు నెలలు పూర్తిగా రెస్టు తీసుకుంటే సరిపోతుందని, అభిమానులు సన్నిహితులు కుటుంబ సభ్యులు టెన్షన్ పడాల్సింది ఏమి లేదని హాస్పిటల్ బులెటిన్ పేర్కొంది. ఆ మేరకు అఫీషియల్ గా ఒక ప్రకటన వచ్చింది.
సరిగ్గా ఈ రోజే రామ్ చరణ్ కు కేరళలో ట్రీట్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సురేఖ, ఉపాసన దీని కోసమే తనతో పాటుగా తోడుగా వెళ్లారు. పెద్ది టైంలో తగిలిన దెబ్బలు తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ రికమండ్ చేశారు. థియేటర్ రన్ పూర్తయిపోయి ఓటిటిలో కూడా పెద్ది వచ్చేయడంతో చరణ్ మీద ఎలాంటి బాధ్యత లేదు. అచ్చం తారక్ లాగే చరణ్ కూడా రెండు మూడు నెలలు సంపూర్ణ విశ్రాంతిలోనే ఉండాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇదే.
వీటి వల్ల డ్రాగన్, ఆర్సి 17 తాలూకు షెడ్యూల్స్ ప్రభావితం చెందుతాయి కానీ ఎవరికైనా ముందు ఆరోగ్యం ముఖ్యం, ఇటీవలే బాలకృష్ణ తన 111 సినిమాలో గాయపడి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకూ విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. చూస్తుంటే ఈ గాయాల పర్వం టాలీవుడ్ స్టార్లను వెంటాడుతున్నట్టు ఉంది. ఇక ఎవరికి ఇలాంటివి జరగకుండా ఉండాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. తారక్, చరణ్, బాలయ్య త్వరగా కోలుకోవాలనేదే అందరి ఆకాంక్ష.
This post was last modified on July 28, 2026 8:07 am
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…