గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్నప్పటికీ.. దాన్నుంచి త్వరగానే కోలుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది జనసేన పార్టీ. కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో జనసేన నాయకులు, కార్యకర్తలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసలందుకుంటున్నాయి.
ఎన్నికలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కూడా జనసేన మద్దతుదారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కరోనాపై అవగాహన పెంచడానికి, సేవా కార్యక్రమాలకు, పార్టీ విధానాల్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటున్నారు. ట్విట్టర్లో జనసేన పార్టీ ఫాలోవర్లు గత కొన్ని నెలల్లో బాగా పెరిగారు. అక్కడ ఆ పార్టీ అఫీషియల్ పేజీ ఓ రికార్డును కూడా కైవసం చేసుకుంది.
ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది జనసేన పార్టీ. ఏపీ, తెలంగాణల్లోనే కాదు.. మొత్తంగా సౌత్ ఇండియాలో 1 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి పార్టీ జనసేనే కావడం విశేషం. ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ట్విట్టర్లో 5.6 లక్షల మంది దాకా ఫాలోవర్లున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని పేరున్న తెలుగుదేశం పార్టీ ఫాలోవర్లు 4 లక్షలే. జనసేన ఫాలోవర్లలో ఎక్కువ మంది యువతే కావడం.. వారిలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల ఆ పార్టీకి ఇంత భారీగా ట్విట్టర్ ఫాలోవర్లున్నారు.
ట్విట్టర్లో రాజకీయ, సామాజిక విషయాల గురించి మాత్రమే మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు 4 మిలియన్ల దాకా ఫాలోవర్లున్నారు. వారిలో మెజారిటీ ఫాలోవర్లను ఇటు మళ్లించగలిగితే జనసేన ఫాలోవర్ల సంఖ్య ఇంకా పెంచుకోవచ్చు. ఐతే ఈ ఫాలోవర్లను ఓటర్లుగా మార్చడమే జనసేన ముందున్న కర్తవ్యం.
This post was last modified on April 26, 2020 9:22 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…