Movie News

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఇవాళ బెంగళూరులో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంతో పాటు ఎక్కువ డిస్కషన్ కు వచ్చిన పాయింట్ ఇదేనట. బాలీవుడ్, మల్లువుడ్ తరహాలో దీన్ని కఠినంగా అమలు చేసే సాధ్యాసాధ్యాలు కూలంకుశంగా మాట్లాడుకున్నారట.

వాస్తవిక కోణంలో దీన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేయగలరా లేక ఊరికే రెండు మూడు వారాలు హడావిడి చేసి వదిలేస్తారా అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టాలీవుడ్ లో మూడు నాలుగు అగ్ర నిర్మాణ సంస్థలు నాలుగు వారాల విండో కండీషన్ మీదే తమ బడ్జెట్ లను రికవర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ గ్యాప్ ని రెట్టింపు చేస్తే వచ్చే ఆదాయం చాలా తగ్గిపోతుంది. థియేటర్లలో బొమ్మ ఫ్లాప్ అయితే నెత్తి మీద తడిగుడ్డ ఖాయం.

ఇంకోవైపు చిన్న సినిమాల కష్టాలు మరోలా ఉన్నాయి. నాలుగు వారాలు కాదు పదిహేను రోజులకే ఓటిటికి ఇచ్చినా ఆడియన్స్ ఎగబడి చూడటం లేదు. టాక్స్, రివ్యూలు అప్పటికే చదివేసి ఉండటంతో సమయం ఎందుకు వృథా చేయడమని ఆగిపోతున్నారు. బాగున్న వాటికి మాత్రమే ఆదరణ దక్కుతోంది. స్టార్ హీరోలకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది కానీ మిగిలినవాళ్లకు ఇది గుదిబండగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా రెండు నెలల తర్వాత డిజిటల్ అంటే ఆత్మహత్యా సదృశ్యమే.

అసలు అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకురావడం మండలి సభ్యులకు పెద్ద సవాలే. రకరకాల ప్రశ్నలు, వాదనలు తలెత్తుతాయి. వాటన్నింటికి సమాధానం చెప్పాలి. ఓ మూడేళ్ళ క్రితం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు కానీ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఈసారి అలా రిపీట్ కాకుండా చూసుకోవాలి. పైరసీ మీద కూడా ఇంకా బలంగా పోరాడాలి. మరికొన్ని రోజుల్లో గైడ్ లైన్స్ రూపంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. చూద్దాం.

This post was last modified on March 11, 2026 10:35 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago